Tata Technologies IPO: 20 ఏళ్ల తరువాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓ; క్యూ కట్టిన ఇన్వెస్టర్లు; అరగంటలో ఫుల్లీ సబ్ స్క్రైబ్డ్
Tata Technologies IPO: టాటా గ్రూప్ నుంచి 20 ఏళ్ల తరువాత తొలి ఐపీఓ నవంబర్ 22, బుధవారం మార్కెట్లోకి వచ్చింది. టాటా మోటార్స్ సబ్సిడయరీ అయిన టాటా టెక్నాలజీస్ ఐపీఓ కు నవంబర్ 24 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.
Tata Technologies IPO: టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ 22న ఓపెన్ అయింది. తొలి రోజే ఇన్వెస్టర్ల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. ఓపెన్ అయిన 30 నిమిషాల్లోపే ఎన్ఐఐ కోటాలో 80%, రిటైల్ పోర్షన్ లో 48% సబ్ స్క్రైబ్ అయి రికార్డు సృష్టించింది. ఆ తరువాత , క్యూఐబీ ఇన్వెస్టర్లు పుంజుకుని 100% సబ్ స్క్రైబ్ చేశారు.
ఫుల్లీ సబ్ స్క్రైబ్డ్..
టాటా టెక్నాలజీస్ ఐపీఓ ఓపెన్ అయిన తొలి రోజే ఉదయం 10.48 గంటల వరకే 1.29 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 1.02 రెట్లు, NII 1.45 రెట్లు, QIB 1.98 రెట్లు, ఉద్యోగుల భాగం 14% సబ్‌స్క్రైబ్ అయింది.
ఐపీఓ వివరాలు..
ఈ టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ 22 నుంచి నవంబర్ 24 వరకు ఓపెన్ ఉంటుంది. నవంబర్ 24 సాయంత్రం 4 గంటల వరకు ఇన్వెస్టర్లు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ. 475 నుంచి రూ. 500 మధ్య నిర్ణయించారు. ఈ ఐపీఓ కు లాట్స్ లో అప్లై చేసుకోవాలి. ఒక్కో లాట్ లో 30 ఈక్విటీ షేర్లు ఉంటాయి. అంటే, ఒక లాట్ కు అప్లై చేయాలంటే రూ. 15,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ షేర్స్ అలాట్ మెంట్ నవంబర్ 27న ఉండవచ్చని అంచనా. అలాగే, ఈ ఐపీఓ స్టాక్ మార్కెట్లో నవంబర్ 29న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.