Gandhar Oil IPO: గాంధార్ ఆయిల్ ఐపీఓ; అప్లై చేయొచ్చా? కంపెనీ పరిస్థితి ఏంటి? జీఎంపీ ఎంత ఉంది?
Gandhar Oil IPO: గంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా ఐపీఓ ఈరోజు ఓపెన్ అయింది. వైట్ ఆయిల్స్ ను ఉత్పత్తి చేస్తున్న ఈ కంపెనీకి 100 కి పైగా దేశాల్లో కస్టమర్లు ఉన్నారు.
Gandhar Oil IPO: గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా IPO సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 22న ఇన్వెసర్ల కోసం ఓపెన్ అయింది. ఈ సంస్థ ఆదాయం పరంగా వైట్ ఆయిల్స్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. "Divyol" బ్రాండ్ పై 440కి పైగా ఐటెమ్‌లను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. వీటిలో ఎక్కువగా లూబ్రికెంట్లు, ప్రాసెస్ అండ్ ఇన్సులేటింగ్ ఆయిల్స్ (PIO), పర్సనల్ కేర్, హెల్త్‌కేర్, పెర్ఫార్మెన్స్ ఆయిల్స్ (PHPO) ఉన్నాయి. ఈ సంస్థకు ఆటోమోటివ్, పారిశ్రామిక, పవర్, టైర్, రబ్బరు ఉత్పత్తి సంస్థలు వినియోగదారులుగా ఉన్నాయి. ఈ సంస్థ కస్టమర్ల జాబితాలో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ (P&G), యూనిలీవర్, మారికో, డాబర్, ఎన్‌క్యూబ్, పతంజలి ఆయుర్వేద్, బజాజ్ కన్స్యూమర్ కేర్, ఇమామి, అమృతాంజన్ హెల్త్‌కేర్ తదితర ప్రముఖ కంపెనీలు ఉన్నాయి.
ఐపీఓ వివరాలు..
గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా ఐపీఓ (Gandhar Oil IPO) నవంబర్ 22న ఓపెన్ అయింది. ఇన్వెస్టర్లు నవంబర్ 24 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 160 నుంచి రూ. 169 మధ్య ఉంది. ఈ ఐపీఓకు లాట్స్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ లో 88 ఈక్విటీ షేర్లు ఉంటాయి. అంటే ఒక లాట్ కు ఇన్వెస్టర్లు రూ. 14, ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ లో 35% షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు, 50% షేర్లను క్యూఐబీలకు, 15% షేర్లను ఎన్ఐఐలకు రిజర్వ్ చేశారు. ఈ ఐపీఓ షేర్స్ అలాట్మెంట్ నవంబర్ 27 న జరిగే అవకాశం ఉంది. అలాగే, స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్ నవంబర్ 28న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
జీఎంపీ ఎంత?
ప్రస్తుతం గ్రే మార్కెట్లో గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా ఐపీఓ షేర్లు బుధవారం రూ. 56 ల ప్రీమియం (GMP) తో ట్రేడ్ అవుతున్నాయి. అంటే, ఇష్యూ ప్రైస్ కన్నా కనీసం రూ. 56 అధికంగా ఒక్కో షేరుపై లాభం పొందే అవకాశం ఉంది. ఈ కంపెనీ ప్రమోటర్లుగా రమేష్ బాబులాల్ పరేఖ్, కైలాష్ పరేఖ్, గులాబ్ పరేఖ్ ఉన్నారు. వారు 22.50 లక్షల చొప్పున తమ ఈక్విటీ షేర్లను ఈ ఐపీఓ ద్వారా అమ్ముతున్నారు. ఈ ఐపీఓ ద్వారా సమకూరిన మొత్తాన్ని రుణాల చెల్లింపునకు, వ్యాపార విస్తరణ కు వినియోగించనున్నారు.
సూచన: ఈ కథనం మార్కెట్ నిపుణుల అభిప్రాయాలు, సూచనలతో రూపొందించబడినది. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో పెట్టుబడులు పెట్టడం సముచితం.