IREDA IPO: మార్కెట్లోకి ప్రభుత్వ రంగ సంస్థ ఐపీఓ; జీఎంపీ ఎంత అంటే?-ireda ipo gmp price subscription status review other details apply or not ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ireda Ipo: మార్కెట్లోకి ప్రభుత్వ రంగ సంస్థ ఐపీఓ; జీఎంపీ ఎంత అంటే?

IREDA IPO: మార్కెట్లోకి ప్రభుత్వ రంగ సంస్థ ఐపీఓ; జీఎంపీ ఎంత అంటే?

HT Telugu Desk HT Telugu
Nov 21, 2023 03:13 PM IST

IREDA IPO opens today: ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (IREDA) ఐపీఓ నవంబర్ 21న ఓపెన్ అయింది. తొలి రోజు గ్రే మార్కెట్లో ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 7 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: Courtesy company website)

IREDA IPO opens today: ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (IREDA) ఐపీఓ ఈ రోజు, నవంబర్ 21 న ఓపెన్ అయింది. ఇన్వెస్టర్లు నవంబర్ 23 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ. 30 నుంచి రూ. 32గా నిర్ణయించారు.

మొత్తం 460 షేర్లు..

IREDA ఐపీఓ లో ఒక్కో లాట్ లో 460 ఈక్విటీ షేర్లు ఉంటాయి. ఇన్వెస్టర్లు లాట్స్ గా సబ్ స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ కు కనీసం రూ. 14,720 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఐఆర్ఈడీఏ ప్రభుత్వ రంగ సంస్థ. మినీ రత్న హోదాలో ఉంది. ఈ ఐపీఓ ద్వారా మొత్తం రూ. 2,150.21 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జీఎంపీ ఎంత?

ఈ ఐఆర్ఈడీఏ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తొలి రోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఐపీఓ 0.81 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. అందులో రిటైల్ పోర్షన్ 1.12 రెట్లు, ఎన్ఐఐ పోర్షన్ 1.14 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. కాగా, ఈ ఐపీఓ షేర్లు తొలి రోజు రూ. 7 జీఎంపీతో ట్రేడ్ అవుతున్నాయి. అంటే, లిస్టింగ్ రోజు ఇష్య ప్రైస్ పై ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 7 ఎక్కువగా లభించే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు..

  • ఐఆర్ఈడీఏ ఐపీఓకు నవంబర్ 21 నుంచి నవంబర్ 23 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.
  • ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ. 30 నుంచి రూ. 32గా నిర్ణయించారు.
  • ఈ ఐపీఓ లో ఒక్కో లాట్ లో 460 ఈక్విటీ షేర్లు ఉంటాయి. ఇన్వెస్టర్లు లాట్స్ గా సబ్ స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది.
  • ఈ ఐపీఓ షేర్ల అలాట్ మెంట్ నవంబర్ 24న కానీ, నవంబర్ 27న కానీ ఉండవచ్చు.
  • నవంబర్ 28న స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
  • ఈ ఐపీఓకు మార్కెట్ నిపుణులు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

సూచన: ఈ కథనం మార్కెట్ నిపుణుల అభిప్రాయాలు, అంచనాలతో రూపొందినది. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.