Alcohol home delivery : మందుబాబులకు గుడ్​ న్యూస్​.. ఇక స్విగ్గీ, జొమాటోతో ఇంటికే ఆల్కహాల్​ డెలివరీ!-swiggy zomato to start alcohol home delivery in major indian states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Alcohol Home Delivery : మందుబాబులకు గుడ్​ న్యూస్​.. ఇక స్విగ్గీ, జొమాటోతో ఇంటికే ఆల్కహాల్​ డెలివరీ!

Alcohol home delivery : మందుబాబులకు గుడ్​ న్యూస్​.. ఇక స్విగ్గీ, జొమాటోతో ఇంటికే ఆల్కహాల్​ డెలివరీ!

Sharath Chitturi HT Telugu
Jul 16, 2024 12:58 PM IST

Alcohol home delivery : దేశంలోని పలు కీలక నగరాల్లో ఇక ఇంటికే మద్యం డెలివరీలను చేపట్టేందుకు స్విగ్గీ, జొమాటో, బిగ్​బాస్కెట్​లు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇక ఇంటికే మద్యం డెలివరీ!
ఇక ఇంటికే మద్యం డెలివరీ! (PTI)

ఫుడ్ డెలివరీ దిగ్గజాలు స్విగ్గీ, బిగ్​బాస్కెట్, జొమాటోలు త్వరలో బీర్, వైన్, లిక్కర్స్ వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్​ని డెలివరీ చేయడం ప్రారంభించనున్నాయి. పలు మీడియా నివేదికల ప్రకారం దిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళతో సహా అనేక రాష్ట్రాలు ఇందుకోసం పైలట్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నాయి. మద్యం డెలివరీలను అనుమతించడం వల్ల కలిగే లాభనష్టాలను అధికారులు ప్రస్తుతం అంచనా వేస్తున్నారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

ఇంటికే మద్యం డెలివరీ..!

2020లో స్విగ్గీ, జొమాటోలు కోవిడ్-19 లాక్​డౌన్​ సమయంలో తమ సేవలను విస్తృతం చేయడానికి నాన్ మెట్రో ప్రాంతాల్లో ఆన్​లైన్​ ఆల్కహాల్ డెలివరీని ప్రారంభించాయి. ఝార్ఖండ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత స్విగ్గీ తన మద్యం డెలివరీ సేవను రాంచీలో ప్రారంభించింది. జొమాటో కూడా ఈ సేవలను తొలుత రాంచీలో ప్రారంభించింది. మరో ఏడు నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది.

అనుమతులకు కొన్ని వారాల నుంచి నెల రోజుల సమయం పడుతుందని తెలిసినా, ఆ సమయంలో, రెండు కంపెనీలు తమ సేవలను విస్తరించడానికి ప్రధాన మెట్రో నగరాల్లోని అధికారులతో చర్చలు జరుపుతున్నాయి. ఒడిశాలోని నగరాలకు మద్యం డెలివరీ సేవలను విస్తరించాలని స్విగ్గీ భావించినప్పటికీ అంఫన్ తుఫాను కారణంగా నిలిపివేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే ఇళ్లకు మద్యం డెలివరీకి అనుమతి ఉంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్​గఢ్​, అసోంలో కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఆంక్షలు ఉన్నప్పటికీ మద్యం డెలివరీలకు తాత్కాలిక అనుమతి విజయవంతమైందని ఈటీ నివేదిక తెలిపింది. ఆన్​లైన్​ డెలివరీల వల్ల పశ్చిమబెంగాల్, ఒడిశాలో అమ్మకాలు 20-30 శాతం పెరిగాయని రిటైల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్​లు చెబుతున్నారు.

"ఇది పెరుగుతున్న జనాభాను అవసరాలను తీర్చడానికి, ముఖ్యంగా పెద్ద నగరాల్లో, మితమైన ఆల్కొహాల్ కంటెంట్ స్పిరిట్లను భోజనంతో పాటు వినోద పానీయంగా భావించే వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది. సాంప్రదాయ మద్యం దుకాణాలు, షాప్-ఫ్రంట్ అనుభవాల నుంచి కొనుగోలు చేయడం అసహ్యకరమైనదిగా గుర్తించిన మహిళలు, సీనియర్ సిటిజన్లకు సైతం ఇది ఉపయోగపడుతుంది," అని ఒక పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ నివేదికలో పేర్కొన్నారు.

ఆన్​లైన్​ డెలివరీ మోడల్స్ వల్ల కలిగే ప్రయోజనాలను స్విగ్గీ కార్పొరేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ దినకర్ వశిష్ట్ వివరించారు. ఇది ఎండ్-టు-ఎండ్ లావాదేవీ రికార్డులు, వయస్సు ధృవీకరణ, పరిమితులకు కట్టుబడి ఉండేలా చూస్తుందన్నారు. "అంతేకాకుండా, ఆన్​లైన్ టెక్ స్టాక్స్ రెగ్యులేటరీ, ఎక్సైజ్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. టైమింగ్స్, డ్రై డేస్​కి కట్టుబడి ఉంటాయి," అని అన్నారు.

ఆన్​లైన్​లో మద్యం హోమ్ డెలివరీలను ప్రారంభించడం ద్వారా రాష్ట్రాలు వినియోగదారుల సౌలభ్యాన్ని పెంపొందించుకోవచ్చని, ఆర్థిక వృద్ధిని పెంచుకోవచ్చని, బాధ్యతాయుతమైన, నియంత్రిత మద్యం పంపిణీని నిర్ధారిస్తూ ప్రపంచ పోకడలకు అనుగుణంగా ఉంటాయని పబ్ చైన్ బీర్ కేఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ సింగ్ ఎకనామిక్ టైమ్స్​తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

కస్టమర్లకు జొమాటో, స్విగ్గీ షాక్..

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ఛార్జీలను పెంచడంతో స్విగ్గీ కూడా పెంచింది. ఇప్పుడు స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం కాస్త ఖరీదైనదిగా మారింది. జొమాటో మొదట ఫ్లాట్ ఛార్జీని రూ .5 నుండి రూ .6కు పెంచింది. ఆ తర్వాత స్విగ్గీ కూడా పెరిగింది. ఇకపై రెండు కంపెనీల కస్టమర్లు ప్రతి ఆర్డర్‌పై రూ.6 ప్లాట్ ఫామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం