Stocks to buy today : స్టాక్స్​ టు బై.. టెక్​ మహీంద్రా, డీఎల్​ఎఫ్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే!-stocks to buy today september 22 sensex and nifty news ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై.. టెక్​ మహీంద్రా, డీఎల్​ఎఫ్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే!

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. టెక్​ మహీంద్రా, డీఎల్​ఎఫ్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Sep 22, 2023 09:14 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై..
స్టాక్స్​ టు బై..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా మొదలుపెట్టాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 15 పాయింట్ల నష్టంతో 66,215 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 19,745 వద్ద కొనసాగుతోంది.

yearly horoscope entry point

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 570 పాయింట్లు కోల్పోయి 66,230 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 19,742 వద్ద ముగిసింది. ఇక 760 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్​ నిఫ్టీ 44,623 మార్క్​ వద్దకు చేరింది.

అమెరికా ఫెడ్​.. ఈసారి వడ్డీ రేట్లను పెంచలేదు. అది సానుకూల విషయమే అయినప్పటికీ.. వచ్చేడాది పూర్తిగా రేట్​ కట్స్​ ఉండవని అధికారులు చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్​లో నెగిటివిటీ నెలకొంది. అందుకే ఇండియన్​ స్టాక్​ మార్కెట్​లు కూడా గత కొన్ని రోజులుగా భారీ నష్టాలను చూస్తున్నాయి.

Stock market news today : ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3007.36 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1158.14 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

అమెరికా సూచీలు..

ఫెడ్​ ఎఫెక్ట్​తో అమెరికా సూచీలు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దారుణంగా పతనమయ్యాయి. డౌ జోన్స్​ 1.08శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.64శాతం, నాస్​డాక్​ 1.82శాతం మేర నష్టాలను చూశాయి.

స్టాక్స్​ టు బై..

Tech Mahindra share price target : టెక్​ మహీంద్రా:- బై రూ. 1292, స్టాప్​ లాస్​ రూ. 1255, టార్గెట్​ రూ. 1350

ఎల్​ అండ్​ టీ:- బై రూ. 2899, స్టాప్​ లాస్​ రూ. 2825, టార్గెట్​ రూ. 3010

DLF share price target : డీఎల్​ఎఫ్​:- బై రూ. 517, స్టాప్​ లాస్​ రూ. 505, టార్గెట్​ రూ. 535

ఎం అండ్​ ఎం ఫైనాన్స్​:- బై రూ. 301, స్టాప్​ లాస్​ రూ. 292, టార్గెట్​ రూ. 318

ఏషియన్​ పెయింట్స్​:- బై రూ. 3240- రూ. 3244, స్టాప్​ లాస్​ రూ. 3210, టార్గెట్​ రూ. 3300

ఈఎంఐఎల్​:- బై రూ. 149- రూ. 150, స్టాప్​ లాస్​ రూ. 145, టార్గెట్​ రూ. 158

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం