Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 560 బ్రేకౌట్​ స్టాక్​పై ఫోకస్​ చేయండి!-stocks to buy today 7 october sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 560 బ్రేకౌట్​ స్టాక్​పై ఫోకస్​ చేయండి!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 560 బ్రేకౌట్​ స్టాక్​పై ఫోకస్​ చేయండి!

Sharath Chitturi HT Telugu
Oct 07, 2024 07:41 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై లిస్ట్​ టుడే..
స్టాక్స్​ టు బై లిస్ట్​ టుడే..

ఇజ్రాయల్​- ఇరాన్​ మధ్య యుద్ధ మేఘాలు, చైనా మార్కెట్​లో కొనుగోళ్లు జోరు కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు గత వారం భారీ కరెక్షన్​కి గురయ్యాయి. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 809 పాయింట్లు పడి 81,688 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 235 పాయింట్లు కోల్పోయి 25,015 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 383 పాయింట్లు పతనమై 51,462 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 9896.95 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8905.08 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అక్టోబర్​ మొదటి వారంలో ఎఫ్​ఐఐలు ఏకంగా రూ. 30719.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 26428.59 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

జాబ్స్​ డేటా సానుకూలంగా రావడంతో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 0.81శాతం పెరిగి రికార్డు స్థాయిలో క్లోజ్​ అయ్యింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.90శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.22శాతం వృద్ధి చెందింది.

ఆసియా మార్కెట్​లు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

సుందరం ఫైనాన్స్ లిమిటెడ్- బై రూ. 5332.8, స్టాప్​ లాస్​ రూ. 5145.38, టార్గెట్​ రూ. 5705

ఇన్పో ఎడ్జ్​ (నౌకరీ) లిమిటెడ్​- బై రూ. 8198.65, స్టాప్​ లాస్​ రూ. 7900, టార్గెట్​ రూ. 8666

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- బై రూ. 2770, స్టాప్​ లాస్​ రూ. 2720, టార్గెట్​ రూ. 2850

అరబిందో ఫార్మా లిమిటెడ్- బై రూ. 1460, స్టాప్​ లాస్​ రూ. 1430, టార్గెట్​ రూ. 1520

పిరామల్​ ఎంటర్​ప్రైజెస్​- బై రూ. 1032, స్టాప్​ లాస్​ రూ. 1010, టార్గెట్​ రూ. 1080

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

శ్రీ రాయలసీమ హై-స్ట్రెంత్ హైపో: రూ.757 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.807, స్టాప్ లాస్ రూ.730;

క్విక్ హీల్ టెక్నాలజీస్: రూ.685 వద్ద కొనండి, టార్గెట్ రూ.725, స్టాప్ లాస్ రూ.660;

వీఐపీ ఇండస్ట్రీస్: రూ.564.15, టార్గెట్ రూ.595, స్టాప్ లాస్ రూ.544;

ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్: రూ.506.15 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.533, స్టాప్ లాస్ రూ.487; మరియు

కేర్ రేటింగ్: రూ .1096.25 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .1150, స్టాప్ లాస్ రూ .1060.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం