Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్! ఇన్ఫోసిస్ స్టాక్‌లో ట్రేడ్ ఛాన్స్! టార్గెట్ ఎంతంటే..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 902 పాయింట్లు పెరిగి 80,378 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 271 పాయింట్లు పెరిగి 24,484 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్ల వృద్ధిచెంది 52,317 వద్దకు చేరింది.
"ఈ డౌన్ ట్రెండ్ ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా 10 డే ఈఎంఏ పైన నిఫ్టీ50 ముగిసింది. ఇది బుల్లిష్ ట్రెండ్ రివర్సల్‌కి సంకేతం. నిఫ్టీకి నెక్ట్స్ రెసిస్టెన్స్ 24,650-24,700 బ్యాండ్‌లో కనిపిస్తోంది. ఇది అక్టోబర్ నెలలో నమోదైన ప్రధాన స్వింగ్ కనిష్టమం," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ డెరివేటివ్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నందీష్ షా అన్నారు. నిఫ్టీ కీలక సపోర్ట్ 24,300 వద్ద కొనసాగుతోందని పేర్కొన్నారు..
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4445.59 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4889.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
నవంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 11,556.72 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,479.04 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల లాస్లో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కారణంగా ఆ దేశ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను చూశాయి. డౌ జోన్స్ 3.57శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 2.53శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.95శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
పిరామల్ ఫార్మా- బై రూ. 293.55, స్టాప్ లాస్ రూ. 283, టార్గెట్ రూ. 311
దీపక్ ఫర్టిలైజర్స్ అండ్ పెట్రో కెమికల్ కార్పొరేషన్- బై రూ. 1391.65, స్టాప్ లాస్ రూ. 1340, టార్గెట్ రూ. 1480
ఇన్ఫోసిస్- బై రూ. 1826, స్టాప్ లాస్ రూ. 1790, టార్గెట్ రూ. 1880
సీయెట్- బై రూ. 2790, స్టాప్ లాస్ రూ. 2740, టార్గెట్ రూ. 2880
అదానీ పోర్ట్స్- బై రూ. 1370, స్టాప్ లాస్ రూ. 1245, టార్గెట్ రూ. 1420.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం