Stocks to buy today : టీసీఎస్ స్టాక్‌కి టైమ్ వచ్చింది! షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్తపాతం కొనసాగుతూనే ఉంది! అక్టోబర్‌లో భారీగా పతనమైన సూచీలు, నవంబర్‌లో జరిగిన తొలి పూర్తిస్థాయి సెషన్లోనూ డీలాపడి, మదుపర్లను మరింత ఆందోళనకు గురిచేశాయి. సోమవారం ట్రేడింగ్ సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 942 పాయింట్లు పడి 78,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 309 పాయింట్లు కోల్పోయి 23,995 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 459 పాయింట్ల నష్టంతో 51,215 వద్దకు చేరింది.
“ప్రస్తుతం మార్కెట్ బలహీనంగా ఉంది. కానీ, అదే సమయంలో ఓవర్సోల్డ్లోకి వెళ్లింది. అందుకే ఇంట్రాడే పుల్‌బ్యాక్ ర్యాలీకి బలమైన అవకాశం ఉంది,” అని కోటాక్ సెక్యూరిటీస్ హెడ్ ఈక్విటీ రీసెర్చ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. ప్రస్తుతానికి నిఫ్టీ50కి 23800, సెన్సెక్స్‌కు 78500 పాయింట్లే కీలకం కానున్నాయని వివరించారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4329.79 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2936.08 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని ఆ దేశ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.6శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.28శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.33శాతం నష్టపోయింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
వి-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- బై రూ. 450.5, స్టాప్‌లాస్ రూ. 435, టార్గెట్ రూ. 485
మ్యాక్స్ హెల్త్‌కేర్- బై రూ. 1036.6, స్టాప్ లాస్ రూ. 994, టార్గెట్ రూ. 1121
టీసీఎస్- బై రూ. 3968, స్టాప్ లాస్ రూ. 3925, టార్గెట్ రూ. 4050
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్- బై రూ. 452, స్టాప్ లాస్ రూ. 442, టార్గెట్ రూ. 468
సంవర్థన్ మధర్సన్ ఇంటర్నేషనల్- బై రూ. 185, స్టాప్ లాస్ రూ. 180, టార్గెట్ రూ. 193
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డ్రెడ్జ్ కార్ప్): రూ.1,022 వద్ద కొనండి. రూ.1,050 టార్గెట్ రూ.1,000 వద్ద స్టాప్ లాస్.
ఇన్ఫోసిస్ లిమిటెడ్ (ఇన్ఫీ): రూ.1,765 వద్ద కొనండి. రూ.1,800 టార్గెట్ స్టాప్ లాస్ రూ.1,745.
హిందుస్తాన్ జింక్ లిమిటెడ్: రూ.544కే కొనండి. లక్ష్యం రూ.575. స్టాప్ లాస్ రూ.520.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం