Stocks to buy today : స్టాక్స్​ టు బై.. రూ. 97 వద్ద ఉన్న ఈ స్టాక్​తో మంచి లాభాలు!-stocks to buy today 3rd october 2023 sensex nifty news ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై.. రూ. 97 వద్ద ఉన్న ఈ స్టాక్​తో మంచి లాభాలు!

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. రూ. 97 వద్ద ఉన్న ఈ స్టాక్​తో మంచి లాభాలు!

Sharath Chitturi HT Telugu
Oct 03, 2023 08:59 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై లిస్ట్​..
స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy today : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్​లకు సెలవు. కాగా.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో బీఎస్​ఈ సెన్సెక్స్​ 320 పాయింట్లు పెరిగి 65,828 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 115 పాయింట్ల లాభంతో 19,638 వద్ద స్థిరపడింది. 284 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ 44,585 వద్దకు చేరింది.

yearly horoscope entry point

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1685.7 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2752.49 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. మొత్తం మీద సెప్టెంబర్​ నెలలో ఎఫ్​ఐఐలు రూ. 26692.15 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

Stock market news today : ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను దేశీయ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ.. ఏకంగా 120 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.22శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.01శాతం మేర నష్టపోయాయి. నాస్​డాక్​ 0.67శాతం లాభపడింది.

ఇదీ చూడండి:- Car sales : దుమ్మురేపుతున్న ఎస్​యూవీ సెగ్మెంట్​.. మహీంద్రా, హ్యుందాయ్​కు బెస్ట్​ సేల్స్​!

స్టాక్స్​ టు బై..

జీఎన్​ఎఫ్​సీ:- బై రూ. 612, స్టాప్​ లాస్​ రూ. 600, టార్గెట్​ రూ. 640

IGL share price target : ఐజీఎల్​:- బై రూ. 456.5, స్టాప్​ లాస్​ రూ. 448, టార్గెట్​ రూ. 475

నేషనల్​ అల్యుమీనియం:- బై రూ. 97.2, స్టాప్​ లాస్​ రూ. 95, టార్గెట్​ రూ. 102

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం