Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ.300 స్టాక్​తో షార్ట్​టర్మ్​లో భారీ గెయిన్స్​!-stocks to buy today 29th october 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ.300 స్టాక్​తో షార్ట్​టర్మ్​లో భారీ గెయిన్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ.300 స్టాక్​తో షార్ట్​టర్మ్​లో భారీ గెయిన్స్​!

Sharath Chitturi HT Telugu
Oct 29, 2024 08:50 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

గత వారం వరుస భారీ నష్టాల అనంతరం సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో స్టాక్​ మార్కెట్​లు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. అన్ని ప్రధాన సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 603 పాయింట్లు పెరిగి 80,005 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 158 పాయింట్లు పెరిగి 24,339 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 472 పాయింట్ల పెరిగితో 51,259 వద్దకు చేరింది.

yearly horoscope entry point

దీపావళి పండుగ వారాన్ని మార్కెట్​లు సానుకూలంగా ప్రారంభించాయి. చమురు ధరలు మరింత పడటం కలిసివస్తోంది. కానీ క్యూ2 ఫలితాలు మిశ్రమంగా ఉండటం, నెలవారీ ఎఫ్​ అండ్​ ఓ ఎక్స్​పైరీ, ఎఫ్​ఐఐల అమ్మకాల నేపథ్యంలో ఈ వారం స్టాక్​ మార్కెట్​లు సైడ్​వేస్​లో కొనసాగొచ్చు,” అని మోతీలాల్​ ఓస్వాల్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​కి చెందిన సిద్ధార్థ ఖేంక తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లోనూ ఎఫ్​ఐఐలు రూ. 3,228.08 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,400.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అక్టోబర్ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు ఏకంగా రూ. 1,03,470.25 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 98,491.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.65శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.27శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.26శాతం వృద్ధి చెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ- బై రూ. 1548.75, స్టాప్​ లాస్​ రూ. 1495, టార్గెట్​ రూ. 1666

శారద క్రాప్​కెమ్​ లిమిటెడ్​- బై రూ. 652.65, స్టాప్​ లాస్​ రూ. 628, టార్గెట్​ రూ. 700

జనరల్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 361, స్టాప్​ లాస్​ రూ. 355, టార్గెట్​ రూ. 370

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఎఫ్ఎస్ఎల్: రూ.372.55 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.405, స్టాప్ లాస్ రూ.363;

ఇండియన్ బ్యాంక్: రూ.551.45 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.585, స్టాప్ లాస్ రూ.530;

పార్ డ్రగ్స్ అండ్ కెమికల్స్: రూ.299.55 వద్ద కొనండి, టార్గెట్ రూ.320, స్టాప్ లాస్ రూ.290;

డైనమిక్ కేబుల్స్: రూ.713.20 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.760, స్టాప్ లాస్ రూ.688; మరియు

నీల్​కమల్: రూ .1964.70 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .2070, స్టాప్ నష్టం రూ .1899.

Whats_app_banner

సంబంధిత కథనం