Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్! ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్‌ని ట్రాక్ చేయండి..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది! ఎఫ్ఐఐల విపరీతమైన విక్రయాలతో శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో కూడా సూచీలు భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 663 పాయింట్లు పడి 79,402 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 219 పాయింట్లు కోల్పోయి 24,181 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 744 పాయింట్ల పెరిగితో 50,787 వద్దకు చేరింది.
నిఫ్టీ50 ఇండెక్స్ 24,700 మార్క్ దిగువకు పడిపోవడంతో మొత్తం భారత స్టాక్ మార్కెట్ ట్రెండ్ బలహీనంగా ఉందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 50 సూచీకి 23,900 వద్ద తక్షణ మద్దతు ఉందని, 24,600- 24,650 శ్రేణిలో రెసిస్టెన్స్ ఉందని తెలిపారు. 50 షేర్ల ఇండెక్స్.. 23,900 మార్కు దిగువకు పడిపోతే దలాల్ స్ట్రీట్ ట్రెండ్ మరింత బలహీనపడవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,036.76 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,159.29 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
అక్టోబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు ఏకంగా రూ. 1,00,242.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 97,090.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.61శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.03శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.56శాతం వృద్ధి చెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
యథార్థ్ హాస్పిటల్: రూ.649.65 వద్ద కొనుగోలు | టార్గెట్ ధర: రూ.690 | స్టాప్ లాస్: రూ.625
థర్మాక్స్ లిమిటెడ్: రూ.5,431.15 వద్ద కొనుగోలు | టార్గెట్ ధర: రూ.5,750 | స్టాప్ లాస్: రూ.5,222
టొరెంట్ ఫార్మాస్యూటికల్స్: రూ.3,433 వద్ద కొనండి | టార్గెట్ ధర: రూ.3,600 | స్టాప్ లాస్: రూ.3,375
ఐసీఐసీఐ బ్యాంక్: రూ.1,260 కొనొచ్చు| టార్గెట్ ధర: రూ.1,310 | స్టాప్ లాస్: రూ.1,230
బీఈఎల్: రూ.275 కొనుగోలు | టార్గెట్ ధర: రూ.290 | స్టాప్ లాస్: రూ.265
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ: రూ.1,500.55 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1,616, స్టాప్ లాస్ రూ.1,440;
ఆసోమ్ ఎంటర్ప్రైజ్: రూ.158.75 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.168, స్టాప్ లాస్ రూ.152;
ఆర్బీఎం ఇన్ఫ్రాకాన్ : రూ.776 వద్ద కొనండి, టార్గెట్ రూ.830, స్టాప్ లాస్ రూ.748;
దీపక్ ఫర్టిలైజర్స్ : రూ.1,133.70 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1,222, స్టాప్ లాస్ రూ.1,100; మరియు
ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్: రూ .448.75 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .470, స్టాప్ లాస్ రూ .432.
సంబంధిత కథనం