Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈరోజు ఈ 7 స్టాక్స్‌ని ట్రాక్ చేయండి..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 73 పాయింట్లు పడి 81,151 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 73 పాయింట్లు కోల్పోయి 24,781 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 51,963 వద్దకు చేరింది.
“డైలీ ఛార్ట్‌లో నిఫ్టీ50 ఒక బేరిష్ క్యాండిల్ని ఫార్మ్ చేసింది. ఇది వీక్నెస్కి సంకేతం. కానీ కీలకమైన 24,700 సపోర్ట్‌ని నిఫ్టీ50 హోల్డ్ చేయగలిగింది. 25,120 దగ్గర ఉన్న 21డీఎంఏ కీలక రెసిస్టెన్స్‌గా మారింది. కానీ 24,700 కిందకి పడితే మాత్రం మరింత వీక్నెస్ కనిపించొచ్చు,” అని సీ. మెహ్తా ఇన్వెస్ట్మెంట్ ఇంటర్మీడియేట్స్ ఏవీపీ టెక్నికల్ అండ్ డెరివేటిస్ రీసెర్చ్ హృషికేశ్ యేద్వే తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,261.83 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,225.91 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
అక్టోబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు ఏకంగా రూ. 82479.73 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 77,402.11 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.80శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.18శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.27శాతం వృద్ధి చెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
సువెన్ ఫార్మాస్యూటికల్స్: రూ.1,276.8 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1,350, స్టాప్ లాస్ రూ.1,230
ఇండిగో పెయింట్స్: రూ.1,654.15 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.1,750, స్టాప్ లాస్ రూ.1,595
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్: రూ.289 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.297, స్టాప్ లాస్ రూ.283.
టొరెంట్ ఫార్మా: రూ.3,385 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.3,480, స్టాప్ లాస్ రూ.3,350.
కోటక్ మహీంద్రా బ్యాంక్: రూ.1,785 వద్ద కొనండి, టార్గెట్ రూ.1,850, స్టాప్ లాస్ రూ.1,730;
మహీంద్రా అండ్ మహీంద్రా : రూ.2,998 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.3,100, స్టాప్ లాస్ రూ.2,950;
డీఎల్ఎఫ్: రూ .859 కు అమ్మండి, టార్గెట్ రూ .830, స్టాప్ లాస్ రూ .875.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం