దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 495 పాయింట్లు పడి 81,007 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 221 పాయింట్లు కోల్పోయి 24,750 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 512 పాయింట్లు పడి 51,289 వద్దకు చేరింది.
"నిఫ్టీ 50 ఇండెక్స్ 25,000 మార్క్ పైన సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ మొదటి గంటలో భారీ అమ్మకాలను చూసింది. ఆ తర్వాత సెషన్ అంతటా డొమినో ఎఫెక్ట్‌తో గరిష్ట స్థాయి నుంచి 300 పాయింట్లు పడిపోయింది. ఇది డైలీ ఫ్రేమ్‌లో హెడ్ అండ్ షోల్డర్ నమూనాను విచ్ఛిన్నం చేసింది. సుమారు 220 పాయింట్ల నష్టాలతో ముగిసింది. గత మూడు సెషన్ల నుంచి ఇది తక్కువ కనిష్ట స్థాయిలను సాధిస్తోంది," అని ఎంఓఎఫ్ఎస్ఎల్ బ్రోకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈక్విటీ డెరివేటివ్స్ అండ్ టెక్నికల్స్ హెడ్ చందన్ తపారియా అన్నారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7,421.40 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,979.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.37శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.02శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.04శాతం వృద్ధి చెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
హెచ్సీఎల్ టెక్నాలజీస్- బై సీఎంపీ | టార్గెట్ ధర: రూ.1,985 | స్టాప్ లాస్: రూ.1,815
నేషనల్ అల్యూమినియం- బై సీఎంపీ | టార్గెట్ ధర: రూ.245 | స్టాప్ లాస్: రూ.216
హెచ్‌పీసీఎల్- బై సీఎంపీ | టార్గెట్ ధర: రూ.460 | స్టాప్ లాస్: రూ.420
అమైన్స్ అండ్ ప్లాస్టిసైజర్స్: రూ.321.85 వద్ద కొనండి, టార్గెట్ రూ.345, స్టాప్ లాస్ రూ.310;
వీజ్మాన్: రూ.136 వద్ద కొనండి, టార్గెట్ రూ.144, స్టాప్ లాస్ రూ.131;
పలాష్ సెక్యూరిటీస్: రూ.163.35 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.175, స్టాప్ లాస్ రూ.157;
కాన్పూర్ ప్లాస్టిపాక్: రూ .129.30 వద్ద కొనండి, టార్గెట్ రూ .136, స్టాప్ లాస్ రూ .125;
నల్వా సన్స్ పెట్టుబడులు: రూ .6251.50 వద్ద కొనండి, టార్గెట్ రూ .6666, స్టాప్ లాస్ రూ .6000.
సంబంధిత కథనం