Stocks to buy today : ఈ రూ. 170 స్టాక్​ని కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-stocks to buy today 13 november 2023 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఈ రూ. 170 స్టాక్​ని కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Stocks to buy today : ఈ రూ. 170 స్టాక్​ని కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Nov 13, 2023 09:42 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే.. (Photo: Bloomberg)

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 261 పాయింట్లు కోల్పోయి 64,998 వద్ద ఉంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 73 పాయింట్ల నష్టంతో 19,452 వద్ద కొనసాగుతోంది.

"నిఫ్టీకి 19,500 లెవల్​ చాలా కీలకం. అది దాటితే.. 19,800 వరకు నిఫ్టీ వెళ్లే అవకాశం ఉంది. 19,250- 19,300 లెవల్స్​ సపోర్ట్​గా ఉన్నాయి," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కు చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

లాభాలు.. నష్టాలు..

ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

బజాజ్​ ఫైనాన్స్​, ఇన్ఫీ, నెస్లే, కొటాక్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఏషియన్​ పెయింట్స్​, హెచ్​యూఎల్​, టెక్​ఎం, టాటా స్టీల్​, టీసీఎస్​, విప్రో, ఎంఎం, ఎస్​బీఐ, రిలయన్స్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Stock market news today : ఇండియా స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి. అక్టోబర్​లో భారీగా విక్రయాలు చేసిన ఎఫ్​ఐఐలు.. నవంబర్​లో కూడా అదే చేస్తున్నారు. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో రూ. 261.81 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 822.64 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా సూచీలు భారీగా లాభపడ్డాయి. డౌ జోన్స్​ 1.15శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.56శాతం, నాస్​డాక్​ 2.05శాతం మేర లాభాలు చూశాయి.

స్టాక్స్​ టు బై..

Axis bank share price target : యాక్సిస్​ బ్యాంక్​:- బై రూ. 1029, స్టాప్​ లాస్​ రూ. 1005, టార్గెట్​ రూ. 1070

ఎన్​ఎండీసీ:- బై రూ. 168, స్టాప్​ లాస్​ రూ. 163, టార్గెట్​ రూ. 176.5

సిటీ యూనియన్​ బ్యాంక్​:- బై రూ. 142, స్టాప్​ లాస్​ రూ. 138, టార్గెట్​ రూ. 150

క్వెస్​ కార్ప్​:- బై రూ. 466- రూ. 467, స్టాప్​ లాస్​ రూ. 456, టార్గెట్​ రూ. 487

Apollo pipe share price target : అపొలో పైప్​:- బై రూ. 696- రూ. 697, స్టాప్​ లాస్​ రూ. 685, టార్గెట్​ రూ. 716

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంత ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం