Stock Market : ఈ 6 కంపెనీలు గత వారం దూసుకెళ్లాయి.. ఎల్ఐసీ కూడా-stock market these 6 companies market value increased last week ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : ఈ 6 కంపెనీలు గత వారం దూసుకెళ్లాయి.. ఎల్ఐసీ కూడా

Stock Market : ఈ 6 కంపెనీలు గత వారం దూసుకెళ్లాయి.. ఎల్ఐసీ కూడా

Anand Sai HT Telugu
Jul 28, 2024 01:48 PM IST

Stock Market News : గత వారం సెన్సెక్స్‌లో 6 కంపెనీలు అద్భుతమైన పనితీరును కనబరిచాయి. ఎల్ఐసీ బాగా పెరిగింది. అయితే ఎస్బీఐ, హిందుస్థాన్ యూనిలీవర్ ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి.

స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్

సెన్సెక్స్‌లోని టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల్లో ఆరు కంపెనీలanan మార్కెట్ క్యాపిటలైజేషన్(మార్కెట్ క్యాప్) గత వారం రూ.1,85,186.51 కోట్లు పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ), ఇన్ఫోసిస్ (ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్) అత్యధికంగా లాభపడ్డాయి. గత వారంలో 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్ 728.07 పాయింట్లు అంటే 0.90 శాతం పెరిగింది.

గత వారంలో ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.44,907.49 కోట్లు పెరిగి రూ.7,46,602.73 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.35,665.92 కోట్లు పెరిగి రూ.7,80,062.35 కోట్లకు చేరింది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.35,363.32 కోట్లు పెరిగి రూ.6,28,042.62 కోట్లకు చేరింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) విలువ రూ.30,826.1 కోట్లు పెరిగి రూ .15,87,598.71 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,282.99 కోట్లు పెరిగి రూ.8,62,211.38 కోట్లకు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వ్యాల్యూ రూ.8,140.69 కోట్లు పెరిగి రూ.12,30,842.03 కోట్లకు చేరింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,008.68 కోట్లు క్షీణించి రూ.20,41,821.06 కోట్లకు పరిమితమైంది. ఐసీఐసీఐ బ్యాంక్ వ్యాల్యూ రూ.28,511.07 కోట్లు క్షీణించి రూ.8,50,020.53 కోట్లకు పరిమితమైంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,427.1 కోట్లు తగ్గి రూ.7,70,149.39 కోట్లకు పరిమితమైంది. హిందుస్థాన్ యూనిలీవర్ వ్యాల్యూ రూ.3,500.89 కోట్లు క్షీణించి రూ.6,37,150.41 కోట్లకు పరిమితమైంది.

సెన్సెక్స్ టాప్ 10 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. టాప్-10 కంపెనీల్లో ఆర్ఐఎల్ మొదటి స్థానంలో నిలవగా, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఎల్ఐసీ, హెచ్యూఎల్, ఐటీసీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి.a

Whats_app_banner