Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 50 పాయింట్లు జంప్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను లాభాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 208పాయింట్లు పెరిగి 59,814 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 17,568 వద్ద కొనసాగుతోంది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో 139 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. 59,606 వద్ద ముగిసింది. 43 పాయింట్ల నష్టంతో 17,511 వద్ద స్థిరపడింది. ఇవి 2022 అక్టోబర్ 18 కనిష్ఠాలు. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 59,859- 17,591 వద్ద మొదలుపెట్టాయి.
స్టాక్స్ టు బై..
Tata Motors share price target : టాటా మోటార్స్:- బై రూ. 433, స్టాప్ లాస్ రూ. 425, టార్గెట్ రూ. 450
గెయిల్:- బై రూ. 98, స్టాప్ లాస్ రూ. 96, టార్గెట్ రూ. 104
ఈఐహెచ్:- బై రూ. 164, స్టాప్ లాస్ రూ. 160, టార్గెట్ రూ. 173
(ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.)
లాభాలు.. నష్టాలు..
ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
మారుతీ సుజుకీ, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, ఎల్టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు..
US Stock market investment tips in Telugu : అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.33శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.53శాతం, నాస్డాక్ 0.72శాతం మేర లాభపడ్డాయి.
ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఎర్లీ ట్రేడ్‌లో జపాన్ నిక్కీ 0.44శాతం, ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.32శాతం, సౌత్ కొరియా కాస్పి 0.26శాతం లాభపడ్డాయి.
చమురు ధరలు..
చమురు ధరలు 2శాతం పెరిగాయి. ఫలితంగా బ్యారెల్ చమురు ధర 1.61 డాలర్లు పెరిగి 82.21 డాలర్లకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
India stock market news : గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,417.24కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,586.06కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.