Stock Market Holiday : ఆ రోజుల్లో స్టాక్ మార్కెట్ క్లోజ్.. గురునానక్ జయంతికి కూడా హాలిడే
Guru Nanak Jayanti Holiday : దీపావళి పండుగకు స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నెలలో మరికొన్ని రోజులు కూడా సెలవులు ఉన్నాయి. ఇందులో గురునానక్ జయంతి కూడా ఉంది.
స్టాక్ మార్కెట్ ఈ నెలలో కూడా కొన్ని రోజులు మూతపడనుంది. నవంబర్ 15 శుక్రవారం గురునానక్ జయంతి, నవంబర్ 20 శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముంబైలో ఓటింగ్ సమయంలో స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. దీంతో స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఉండదు.
గురునానక్ జయంతి రోజున నవంబర్ 15 శుక్రవారం నాడు ఎన్ఎస్‌ఈ, బీఎస్ఈ సహా భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు మూసివేసి ఉంటాయి. షేర్లు, డెరివేటివ్‌లు, కమోడిటీలతో సహా ఎందులోనూ ట్రేడింగ్ జరగదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. ఆ రోజు స్థానికులు ఓటు వేసేందుకు వీలుగా సార్వత్రిక సెలవు ప్రకటించారు. దీంతో ముంబైలో ఏ ఎన్నికలు జరిగినా ఆ రోజు స్టాక్ మార్కెట్ పనిచేయదు. ముంబైలో పోలింగ్ రోజున స్టాక్ మార్కెట్ మూసి వేసి ఉంటుంది. ఎన్ఎస్ఈ సెలవు ప్రకటించింది.
భారతదేశంలో అతిపెద్ద కమోడిటీ ఎక్స్ఛేంజ్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(MCX) శుక్రవారం తెరిచి ఉంటుంది. అయితే నవంబర్ 15న ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు మూసి వేస్తారు. సాయంత్రం 5 గంటల నుండి 11:30 గంటల వరకు తిరిగి ప్రారంభమవుతుంది. భారతీయ స్టాక్ మార్కెట్లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ 20వ తేదీన పోలింగ్ తర్వాత.. నవంబర్ 21 న యథావిధిగా తిరిగి ప్రారంభమవుతుంది.
బ్యాంకు సెలవులు
బ్యాంకులకు కూడా నవంబర్ 15న గురునానక్ జయంతి సందర్భంగా సెలవులు ఉంటాయి. తెలంగాణ, ఒడిశా, చండీఘడ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, దిల్లీ, గుజరాత్, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయి. నవంబర్ 17 ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. నవంబర్ 18న కనకదాస జయంతిని పురస్కరించుకుని కర్ణాటకలో బ్యాంకులు మూసి ఉంటాయి. నవంబర్ 23 నాలుగో శనివారం, నవంబర్ 24వ తేదీన ఆదివారం సందర్భంగా బ్యాంకలు హాలిడే.
స్కూల్ హాలిడేస్
ఈ నెలలో పాఠశాలలకు కూడా సెలవులు కలిసి వస్తున్నాయి. నవంబర్ 14వ తేదీన జవహర్ లాల్ నెహ్రూ జయంతి.. బాలల దినోత్సవం నిర్వహిస్తారు. కొన్ని స్కూళ్లు హాఫ్ డే వరకే ఉంటాయి. నవంబర్ 15వ తేదీన గురునానక్ జయంతి. సిక్కులకు చాలా పవిత్రమైన రోజు. అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు సెలవులు ప్రకటించాయి. 16వ తేదీన శనివారం కొన్ని స్కూళ్లు హాఫ్ డే ఉంటాయి. నవంబర్ 18న ఆదివారం. ఇలా వరుసగా విద్యార్థులకు సెలవులు వస్తున్నాయి.