Stocks To Buy : ఈ స్టాక్స్ కొంటే లాభాలు ఉంటాయంటున్న నిపుణులు
Stocks To Buy : స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా అనుకున్నంతగా రాణించలేదు. అయితే ఇన్వెస్టర్లు ఈ సమయంలో ఎలాంటి స్టాక్స్ కొనాలా అని ఆలోచిస్తుంటారు. అలాంటివారికి నిపుణుల ఇచ్చే సలహా ఏంటో తెలుసుకోండి.
గత మూడు సెషన్లలో ఫ్రంట్ లైన్ ఇండెక్స్ సెన్సెక్స్-నిఫ్టీ నాలుగు శాతానికి పైగా పతనమయ్యాయి. మార్కెట్ పతనం తర్వాత మూడు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.22 లక్షల కోట్లు తగ్గింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,02,996.27 కోట్లు తగ్గి రూ.4,39,59,953.56 కోట్లకు (5.24 ట్రిలియన్ డాలర్లు) పరిమితమైంది.
ప్రభుదాస్ లిల్లాధేర్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ కొన్నిస్టాక్స్ కొనుగోలు చేయాలని సూచించారు. బ్రిటానియా ఇండస్ట్రీస్, నాట్కో ఫార్మా, అమీ ఆర్గానిక్స్ మూడు ఇంట్రాడే స్టాక్స్‌ను ఈ రోజు జాబితా చేశారు. మంగళవారం వాల్ స్ట్రీట్ పుంజుకుని ఒక శాతానికి పైగా పెరిగింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కూడా ఆగస్టు 6న 1 శాతం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 58 సెంట్లు లేదా 0.8 శాతం పెరుగుదలతో 76.88 డాలర్లకు ఎగసింది.
బ్రిటానియా ఇండస్ట్రీస్ ను రూ.5,854 వద్ద కొనుగోలు చేయండి, రూ.6,100 టార్గెట్ ఉంచండి. రూ.5,720 స్టాప్‌లాస్ పెట్టండి.
నాట్కో ఫార్మాను రూ.1,351.65 వద్ద కొనుగోలు చేయండి, రూ.1,405 టార్గెట్ పెట్టుకోండి. రూ.1,320 స్టాప్ లాస్ పెట్టడం మర్చిపోవద్దు.
అమీ ఆర్గానిక్స్‌ను రూ.1,299.90 వద్ద కొనుగోలు చేయండి, రూ.1,355 టార్గెట్ ఉంచండి. స్టాప్ లాస్‌ను రూ.1,274 వద్ద ఆపండి.
అమెరికాలో ఆర్థిక మందగమనం, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మార్కెట్ల ఓవర్ వ్యాల్యుయేషన్ల పై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ లు సెన్సెక్స్, నిఫ్టీ 50 వరుసగా మూడో సెషన్ లోనూ నష్టాలను కొనసాగించాయి.
మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం కొనసాగుతోంది. దాని ఫలితం ఆగస్టు 8 న ఉంటుంది. రెపో రేట్లపై ఆర్బీఐ యథాతథ స్థితిని కొనసాగిస్తుందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. అయితే ఆర్బీఐ విధాన వైఖరిలో మార్పు ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
గమనిక : ఇవి నిపుణుల సిఫార్సులు, సలహాలు, అభిప్రాయాలు మాత్రమే. HT Teluguకి ఎలాంటి సంబంధం లేదు. ఇది స్టాక్ పనితీరు గురించి మాత్రమే, పెట్టుబడి సలహా గురించి కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌కు లోబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి.