Muhurat Trading Stock Picks : ఎందుకైనా మంచిది ముహూరత్ ట్రేడింగ్‌లో ఈ స్టాక్స్ మీద ఓ లుక్ వేసి ఉండండి-stock market experts advice these stocks on diwali special muhurat trading check in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Muhurat Trading Stock Picks : ఎందుకైనా మంచిది ముహూరత్ ట్రేడింగ్‌లో ఈ స్టాక్స్ మీద ఓ లుక్ వేసి ఉండండి

Muhurat Trading Stock Picks : ఎందుకైనా మంచిది ముహూరత్ ట్రేడింగ్‌లో ఈ స్టాక్స్ మీద ఓ లుక్ వేసి ఉండండి

Anand Sai HT Telugu
Oct 29, 2024 05:00 PM IST

Muhurat Trading Stock Picks : దీపావళి అనగానే ఇన్వెస్టర్లకు గుర్తుకు వచ్చేది ముహూరత్ ట్రేడింగ్. గంటసేపు జరిగే ఈ ట్రేడింగ్‌పై అందరూ దృష్టిపెడతారు. అయితే ముహూరత్ ట్రేడింగ్‌లో చూడాల్సిన కొన్ని స్టాక్స్ గురించి నిపుణులు చెబుతున్నారు.

దీపావళి ముహూరత్ ట్రేడింగ్
దీపావళి ముహూరత్ ట్రేడింగ్

దీపావళి వచ్చిందంటే స్టాక్ మార్కెట్‌లకు కూడా పండుగే. ఈ సందర్భంగా ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఇది సాయంత్రంపూట గంట సేపు మాత్రమే జరుగుతుంది. ఈసారి ఈ ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు జరగనుంది. కొంతమంది విశ్లేషకులు ఈ ప్రత్యేక ట్రేడింగ్ కాలంలో ఏ స్టాక్‌లను కొనుగోలు చేస్తే సమీప భవిష్యత్తులో లాభాలు ఉంటాయో చెప్పారు.

దీపావళికి షాపింగ్ చేయడం, బంగారం కొనడంలాంటివి చేస్తుంటారు. కొంతమంది ఇన్వెస్టర్లు మాత్రం ఈ ముహూరత్ ట్రేడింగ్ కోసం ఏడాది అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. దీపావళి రోజు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తే వచ్చే దీపావళి వరకు లాభాలు వస్తాయనే నమ్మకం. దీపావళికి సెలవు అయినా స్టాక్ మార్కెట్లు ఒక గంట వ్యవధిలో ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తుంది.

ఈ ప్రత్యేక సెషన్ ఉండేది గంటే అయినప్పటికీ.. లావాదేవీలు మాత్రం భారీగా జరుగుతాయి. లాభనష్టాల మధ్య సూచీలు ఊగిసలాడుతున్నాయి. ఈ ట్రేడింగ్‌లో స్టాక్స్ ఎక్కువగా కొంటారు పెట్టుబడిదారులు. అయితే ఈసారి ముహూరత్ ట్రేడింగ్ కోసం బ్రోకరేజ్ సంస్థ ఫండ్స్ ఇండియా కొన్ని స్టాక్‌లకు సూచించింది. దీపావళి రోజున ఆ స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే.. మంచి రాబడి వస్తుందని అంటోంది. వాటిపై ఓ లుక్కేద్దాం..

సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లను కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీని కొనుగోలు ధర రూ. 1461, టార్గెట్ ధర రూ. 1845. ఇది ప్రస్తుత ధర కంటే దాదాపు 26 శాతం ఎక్కువ.

కళ్యాణ్ జ్యువెలర్స్‌లో షేర్లను కొనుగోలు చేయవచ్చు. దీని కొనుగోలు ధర రూ. 676. టార్గెట్ ధర రూ. 846. అంటే దానితో పోలిస్తే మీరు ఒక సంవత్సరంలో దాదాపు 25 శాతం లాభాన్ని ఆశించవచ్చు.

ఫెడరల్ బ్యాంక్ కంపెనీ షేర్లను కొనుగోలు చేయవచ్చు. దీని కొనుగోలు ధర రూ. 189, టార్గెట్ ధర రూ. 325 ఉంది. ఇది ప్రస్తుత ధర కంటే 24 శాతం ఎక్కువ

వెల్స్‌పన్ కార్పొరేషన్ షేర్లను కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 681 ఉంది. టార్గెట్ ధర రూ. 840. ప్రస్తుత ధర కంటే దాదాపు 23 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా.

మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లను కొనవచ్చు. దీని కొనుగోలు ధర రూ. 2566, టార్గెట్ ధర రూ. 3158, ఇది దాని ప్రస్తుత ధర కంటే 23 శాతం ఎక్కువ.

జెఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్ షేర్లను కొనొచ్చు. ధర రూ. 670, టార్గెట్ ధర రూ. 825 ఉంది. ఇది ప్రస్తుత ధర కంటే 23 శాతం ఎక్కువ.

గమనిక : ఇది కేవలం నిపుణుల అభిప్రాయం మాత్రమే. పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్నది.

Whats_app_banner