Best Bank in India : ఎస్బీఐకి 'బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా' 2024' అవార్డు..
SBI Best bank in India 2024 : గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 2024 సంవత్సరానికి గాను బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా పేరును ప్రకటించింది. ఈ అవార్డును ఎస్బీఐ దక్కించుకుంది. పూర్తి వివరాలు..
2024కి గాను బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ). ఈ మేరకు వాషింగ్టన్లో ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన వార్షిక సమావేశాల సందర్భంగా అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ గుర్తింపును ఇచ్చింది.
అసాధారణ సేవలను అందించడం, దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితతను ప్రోత్సహించడంలో బ్యాంక్ బలమైన నిబద్ధతకు గుర్తింపుగా ఇచ్చే ఈ అవార్డును ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అందుకున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
దశాబ్దాలుగా, గ్లోబల్ ఫైనాన్స్ ఉత్తమ బ్యాంకు అవార్డులు ప్రపంచ ఆర్థిక సంస్థల పనితీరును అంచనా వేయడానికి విశ్వసనీయమైన ప్రమాణాలను నిర్దేశించాయి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ కాలంలో, కార్పొరేట్ నిర్ణయాలు తీసుకునేవారికి అవి అమూల్యమైనవిగా మారాయి.
భారత దేశంలో ఎస్బీఐకి విస్తృతమైన నెట్వర్క్ ఉంది. దేశవ్యాప్తంగా 22,500కిపైగా బ్రాంచ్‌లు, 62వేలకుపైగా ఏటీఎంలను ఎస్బీఐ నిర్వహిస్తూ భారత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక యోనో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసింది. ఒక్క ఎఫ్వై25 క్యూ1లోనే ఈ యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా రూ. 1,300 కోట్లను ప్రీ-అప్రూవ్ చేయడం జరిగింది. పైగా సంస్థకు చెందిన 63శాతం సేవింగ్స్ అకౌంట్ ఇందులోనే డిజిటల్‌గా ఓపెన్ అవ్వడం విశేషం.
ఎస్బీఐ కస్టమర్స్‌కి దీపావళి గిఫ్ట్..
లోన్స్, ఎఫ్‌డీలపై ప్రతీ నెలా బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. తాజాగా ఎస్బీఐ కూడా వడ్డీ రేట్లకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను వెల్లడించింది. ఎంపిక చేసిన టెన్యూర్‌లపై ఎంసీఎల్ఆర్ 25 బేసిక్ పాయింట్లు తగ్గింది. సవరించిన MCLR అక్టోబర్ 15 నుండి అమలులోకి వచ్చింది. స్వల్పకాలికమైనప్పటికీ వినియోగదారులకు రుణం తీసుకునే ఖర్చును తగ్గించేందుకు ఇది రూపొందించారు.
భారతదేశపు ప్రధాన పండుగ దీపావళి సందర్భంగా క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై తగ్గింపులు, తక్కువ రుణ వడ్డీ రేట్లు సహా ఆకర్షణీయమైన ఆఫర్‌లను ప్రకటిస్తుంటాయి.
ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 8.20 శాతం నుంచి 9.1 శాతం పరిధిలో ఉన్నాయి. ఇందులో ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 8.20శాతం, ఒక నెలకు ఈ రేటు 8.45 శాతం నుండి 8.20%కి తగ్గించారు. అదే సమయంలో ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.85శాతంగా సెట్ చేశారు. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.95 శాతానికి సవరించారు. అయితే రెండేళ్ల MCLR 9.05 శాతానికి సవరించగా.. ఇది కాకుండా మూడు సంవత్సరాలకు ఈ రేటు 9.1 శాతంగా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం