Realme 5G Phone : రియల్‌మీ లవర్స్‌కి సర్‌ప్రైజ్.. సైలెంట్‌గా వచ్చిన 5జీ ఫోన్
Realme 5G Phone : రియల్‌మీ లవర్స్‌కి ఓ సర్ ప్రైజ్. ఈ కంపెనీ కొత్త ఫోన్ నిశబ్దంగా భారతదేశంలోకి వచ్చింది. భారతీయ మార్కెట్లో Realme Narzo 70 Turbo 5G ఫోన్‌ను విడుదల చేసింది. ఇది గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఫోన్ ధర, ఫీచర్లను తెలుసుకుందాం.
రియల్‌మీ నార్జో 70 టర్బో 5G ఫోన్‌ని రియల్‌మి మూడు స్టోరేజీల వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్ కలిగి ఉంది. డైనామిక్ టెక్నాలజీతో 26GB RAM, నీరు, ధూళి నుంచి రక్షణకు IP65 రేటింగ్ పొందింది. 5000mAh సహా అనేక ఫీచర్లు ఈ కొత్త ఫోన్‌లో ఉన్నాయి.
కంపెనీ భారతీయ మార్కెట్లో మూడు స్టోరేజ్ వేరియంట్లలో రియల్‌మీ నార్జో 70 టర్బో 5G ఫోన్‌ను విడుదల చేసింది. దీని 6GB + 128GB స్టోరేజ్ ధర రూ.16,999. 8GB + 128GB స్టోరేజ్ ధర రూ. 17,999. దీని టాప్ మోడల్ 12GB + 256GB స్టోరేజ్ ధర రూ.20,999గా నిర్ణయించారు. ఇది టర్బో ఎల్లో, టర్బో పర్పుల్, టర్బో గ్రీన్ రంగుల్లో వస్తుంది.
ఈ మొబైల్ కొనుగోలుపై కంపెనీ రూ.2,000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపుతో బేస్ మోడల్ రూ.14,999కి అందుబాటులో ఉంటుంది. మీడియం మోడల్ రూ.15,999, టాప్ మోడల్ ధర రూ.18,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 12 గంటలకు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్, రియల్‌మీ.కామ్, ఇతర రిటైల్ అవుట్‌లెట్‌లలో అమ్మకానికి ఉంటుంది.
రియల్‌మీ నార్జో 70 టర్బో 5G ఫోన్ 6.67-అంగుళాల శాంసంగ్ ఈ4 ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 7300 ఎనర్జీ 5G 4nm చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది Android 14 ఆధారంగా Realme UI 5.0 పై రన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ అద్భుతమైన గేమింగ్ ఫీచర్లతో వస్తుంది. అనేక గేమ్‌లలో 90FPS పనితీరును అందిస్తుంది.
రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో F1.8 అపర్చర్‌తో 50 మెగాపిక్సెల్ ప్రాథమిక కెమెరా అందుబాటులో ఉంది. ఇది 2 మెగాపిక్సెల్ f/2.4 అపర్చర్ లెన్స్ మద్దతును పొందుతుంది. సెల్ఫీ, వీడియో కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 45W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.