Redmi 13 5G Discount : రెడ్‌మీ 13 5జీపై మంచి డిస్కౌంట్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108 ఎంపీ కెమెరా కూడా-redmi 13 5g with 108mp camera smartphone get discount on amazon know how much you have to pay ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi 13 5g Discount : రెడ్‌మీ 13 5జీపై మంచి డిస్కౌంట్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108 ఎంపీ కెమెరా కూడా

Redmi 13 5G Discount : రెడ్‌మీ 13 5జీపై మంచి డిస్కౌంట్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108 ఎంపీ కెమెరా కూడా

Anand Sai HT Telugu
Sep 04, 2024 08:18 AM IST

Redmi 13 5G Discount : బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునేవారికి గుడ్ న్యూస్. రెడ్‌మీ ఫోన్లు డిస్కౌండ్ ధరతో రానున్నాయి. ఆఫర్ ప్రకటించిన ఫోన్‌లో 108 ఎంపీ కెమెరాతోపాటుగా ఇతర అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

రెడ్‌మీ 13 5జీపై డిస్కౌంట్
రెడ్‌మీ 13 5జీపై డిస్కౌంట్

టెక్ బ్రాండ్ షియోమీ వివిధ సెగ్మెంట్లలో కెమెరాలు, పనితీరు కలిగిన గాడ్జెట్స్‌ను ప్రవేశపెట్టింది. వివిధ పరికరాలపై మంచి మంచి డిస్కౌంట్లు అందిస్తుంది. తాజాగా మరో డీల్‌తో ముందుకు వచ్చింది. మీరు 108 ఎంపీ కెమెరా ఉన్న రెడ్‌మీ 13 5 జీని ప్రత్యేక తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఈ డిస్కౌంట్ ప్రయోజనం అందుబాటులో ఉంది. కూపన్ డిస్కౌంట్ల కారణంగా ప్రతి ఒక్కరూ ఈ పరిమిత కాల డీల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ డీల్ గురించి తెలుసుకుందాం..

రెడ్‌మీ 13 5జీ ధర, ఆఫర్

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన రెడ్‌మీ 13 5జీ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.13,998గా ఉంది. రెండో వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,498గా ఉంది. 8 జీబీ ర్యామ్ వేరియంట్లను ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో బేస్ వేరియంట్‌పై రూ .1000 ఫ్లాట్ కూపన్ డిస్కౌంట్ ఇవ్వబడింది.

కూపన్ డిస్కౌంట్ తర్వాత రెడ్‌మీ 13 5జీ ప్రారంభ ధర రూ.12,998 అవుతుంది. ఇది కాకుండా మీరు పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ .13,100 వరకు తగ్గింపు పొందవచ్చు. దాని విలువ పాత ఫోన్ మోడల్, దాని పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. బ్లాక్ డైమండ్, హవాయి బ్లూ, ఆర్కిడ్ పింక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఫీచర్లు

ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లేయర్‌ను కలిగి ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించారు. అలాగే ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ సాఫ్ట్ వేర్ స్మూత్ స్కిన్ బెనిఫిట్ ఇస్తుంది.

108 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని 5030 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీకి 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.