Redmi 13 5G : రెడ్‌మీ 13 5జీ ఫోన్.. 108MP అదిరిపోయే కెమెరా.. ఇంకా బోలేడు ఫీచర్లు ఉన్నాయి లోపల-redmi 13 5g launched in india know design features price xiaomi budget phones ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi 13 5g : రెడ్‌మీ 13 5జీ ఫోన్.. 108mp అదిరిపోయే కెమెరా.. ఇంకా బోలేడు ఫీచర్లు ఉన్నాయి లోపల

Redmi 13 5G : రెడ్‌మీ 13 5జీ ఫోన్.. 108MP అదిరిపోయే కెమెరా.. ఇంకా బోలేడు ఫీచర్లు ఉన్నాయి లోపల

Anand Sai HT Telugu
Jul 09, 2024 03:20 PM IST

Xiaomi Redmi 13 5G Launched : రెడ్‌మీ 13 5జీ ఫోన్ లాంచ్ అయింది. రెడ్ మీ 12 5జీకి కొనసాగింపుగా దీనిని తీసుకొచ్చారు. ధర కూడా బడ్జెట్‌లోనే ఉంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..

రెడ్‌మీ 13 5జీ ఫోన్ లాంచ్
రెడ్‌మీ 13 5జీ ఫోన్ లాంచ్

రెడ్‌మీ 13 5జీ భారతదేశంలో లాంచ్ అయింది. రెడ్‌మీ తన నూతన స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ 13 5జీని 10వ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన కెమెరా, బ్యాటరీతో లాంచ్ చేసింది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5,030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

రెడ్ మీ 13 5జీ బడ్జెట్ ధరలో వస్తుంది. షావోమి హైపర్‌ఓఎస్‌తో వస్తున్న తొలి రెడ్‌మీ ఫోన్ ఇది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ (యాక్సిలరేటెడ్ ఎడిషన్) చిప్ సెట్ తో భారత్ లో లాంచ్ అయిన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. రెడ్‌మీ 13 5జీలో 108 ఎక్స్ సెన్సార్ జూమ్ సపోర్ట్‌తో 3 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

ఇండియాలో రెడ్‌మీ 13 5జీ ధర

రెడ్ మీ 13 5జీ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. రెడ్‌మీ 13 5జీ 6జీబీ+128జీబీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 8జీబీ+128జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.15,499గా నిర్ణయించారు. హవాయి బ్లూ, బ్లాక్ డైమండ్, ఆర్కిడ్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

అయితే కెమెరా పక్కనుంటే రింగ్ ఫ్లాష్ ఇందులో ప్రత్యేకం. ఎందుకంటే ఫొటో తీసేటప్పుడే కాకుండా కాల్స్, నోటిఫికేషన్స్ టైములోనూ ఇది ఫ్లాష్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్‌తో ఇది పని చేస్తుంది. రెండు ఓఎస్, నాలుగేళ్ల వరకూ సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ పేర్కొంది.

రెడ్‌మీ 13 5జీ స్మార్ట్ ఫోన్ జూలై 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ సైట్ అమెజాన్, mi.com ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌పై రూ.1000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ.1000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.