Realme 13+ 5G Sale : రియల్‌మీ 13ప్లస్ 5జీ ఫస్ట్ సేల్.. మూడు వేల డిస్కౌంట్.. డోంట్ మిస్
Realme 13+ 5G First Sale : రియల్‌మీ కంపెనీ ఇటీవల Realme 13+ 5G ఫోన్‌ను విడుదల చేసింది. ఇది దాని రియల్‌మీ 13 సిరీస్ నుండి తాజా మిడ్ రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ సెప్టెంబర్ 6 నుంచి విక్రయానికి రానుంది. అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఫోన్ ధర, ఇతర వివరా గురించి తెలుసుకుందాం.
రియల్‌మీ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునేవారికి మంచి అవకాశం. సెప్టెంబర్ 6 నుంచి సేల్‌కి వస్తుంది. రియల్‌మీ 13ప్లస్ 5జీ ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ చేశారు. ఇందులో 8జీబీ ర్యామ్‌తో 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్‌తో 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్‌తో 256జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
రియల్‌మీ 13+ 5జీ ఫోన్ ధర
8జీబీ + 128జీబీ ధర - రూ 22,999.
8జీబీ + 256జీబీ ధర - రూ 24,999.
12జీబీ + 256జీబీ ధర - రూ 26,999.
కంపెనీ రియల్‌మీ 13+ 5జీ ఫోన్‌ను విక్టరీ గోల్డ్, స్పీడ్ గ్రీన్, డార్క్ పర్పుల్ రంగులలో తీసుకొచ్చింది. మీరు ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 6 నుండి కొనుగోలు చేయవచ్చు. తొలి సేల్‌లో భాగంగా కంపెనీ కొన్ని ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 3,000 తగ్గింపుతోపాటుగా 1,500 క్యాష్‌బ్యాక్ లిమిటెడ్ ప్రీ-బుకింగ్ ఆఫర్‌లు పెట్టింది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ realme.com, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కూడా ప్రీ-బుకింగ్ చేయవచ్చు.
రియల్‌మీ 13ప్లస్ 5జీ ఫోన్ ఫీచర్లు
రియల్‌మీ 13ప్లస్ 5జీ ఫోన్ 6.67-అంగుళాల పూర్తి హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2400 × 1080 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ట ప్రకాశానికి మద్దతు ఇస్తుంది. ఇందులో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది. రియల్‌మీ యూఐ5తో ఆండ్రాయిడ్ 14తో ఫోన్ రన్ అవుతుంది.
రియల్‌మీ 13ప్లస్ 5జీ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, Sony LYT-600 సెన్సార్ ఉన్నాయి. అంతేకాకుండా LED ఫ్లాష్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
నీరు, ధూళి నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్ పొందింది. ఇది 161.7×74.7×7.6 mm మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లలో 3.5mm ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 802.11 ax (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.4, GPS, గెలీలియో, USB టైప్-సి ఉన్నాయి.