Vizag RK Beach : వైజాగ్ ఆర్కే బీచ్ లో సముద్రం 400 మీటర్లు వెనక్కి, సెల్ఫీలతో సందర్శకుల సందడి
- Vizag RK Beach : వైజాగ్ ఆర్కే బీచ్ చాలా ఫేమస్. వైజాగ్ వెళ్లారంటే, బీచ్‌కి వెళ్లావా లేదా అని అడుగుతారు. అలాంటి వైజాగ్ బీచ్ దాదాపుగా 400 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలో బయటపడ్డ రాళ్లపై నిలబడి సందర్శకులు ఫొటోలకు ఫోజులిస్తున్నారు.
- Vizag RK Beach : వైజాగ్ ఆర్కే బీచ్ చాలా ఫేమస్. వైజాగ్ వెళ్లారంటే, బీచ్‌కి వెళ్లావా లేదా అని అడుగుతారు. అలాంటి వైజాగ్ బీచ్ దాదాపుగా 400 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలో బయటపడ్డ రాళ్లపై నిలబడి సందర్శకులు ఫొటోలకు ఫోజులిస్తున్నారు.
(1 / 6)
రాష్ట్రంలో వైజాగ్ బీచ్ చాలా ఫేమస్. వైజాగ్ వెళ్లారంటే, బీచ్‌కి వెళ్లావా లేదా అని అడుగుతారు. అలాంటి వైజాగ్ బీచ్ 400 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలో బయటపడ్డ రాళ్లపై నిలబడి సందర్శకులు ఫొటోలకు ఫోజులిస్తున్నారు.
(2 / 6)
విశాఖ ఆర్కే బీచ్ లో సందర్శకుల సందడి ఎక్కువగా ఉంది. రాళ్లపై నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. బీచ్‌లో ఎగిసిపడే అలలను చూసి పెద్దలు కూడా పిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేస్తున్నారు.
(3 / 6)
సరదాగా నీళ్లల్లో ఆడుతూ సేద తీరుతున్నారు. మరికొంత మంది అలల తాకిడిని చూసి పులకరిస్తున్నారు. అలలు కాస్త వెనక్కి వెళితే, రోజూ సేద తీరే తీరం ఇంకాస్త బయటపడుతుంది.
(4 / 6)
వైజాగ్ ఆర్‌కే బీచ్‌లో సముద్రం దాదాపు నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలోని బండరాళ్లు బయటపడ్డాయి. సముద్రం ఇలా వెనక్కి వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. సముద్రపు అలలు, గురుత్వాకర్షణ శక్తి కారణం కావొచ్చని అంటున్నారు.
(5 / 6)
బీచ్‌లో సేద తీరేందుకు వచ్చిన ప్రజలు సముద్రం వెనక్కి వెళ్లడం చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఆపై రాళ్లపైకి చేరి సెల్ఫీలు దిగుతూ చిన్నారులు, పెద్దలు సందడి చేస్తున్నారు. వైజాగ్ అంటేనే బీచ్ గుర్తుకు వస్తుంది. ఆ బీచ్ చాలా మంది మనశ్శాంతికి ఒక వేదిక అవుతోంది. ఉదయం నుంచి బిజీ పనుల్లో ఉన్న ప్రజలు సాయంత్రం అలా బీచ్ ఒడ్డుకు చేరతారు. అక్కడ కాసేపు ప్రశాంతంగా గడుపుతారు. Vizag RK Beach moving backwards
ఇతర గ్యాలరీలు