రియల్‌మీకి చెందిన ఈ ఫోన్ అండర్ వాటర్ ఫొటోగ్రఫీ కూడా చేస్తుంది.. త్వరలో లాంచ్-realme gt 7 pro photography features revealed ahead of launch on november 26th ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రియల్‌మీకి చెందిన ఈ ఫోన్ అండర్ వాటర్ ఫొటోగ్రఫీ కూడా చేస్తుంది.. త్వరలో లాంచ్

రియల్‌మీకి చెందిన ఈ ఫోన్ అండర్ వాటర్ ఫొటోగ్రఫీ కూడా చేస్తుంది.. త్వరలో లాంచ్

Anand Sai HT Telugu
Nov 11, 2024 08:00 PM IST

Realme GT 7 Pro : రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్ నవంబర్ 26న భారతదేశంలో లాంచ్ కానుంది. ఇప్పుడు కంపెనీ రియల్‌మీ జీటీ 7 ప్రో ఫోటోగ్రఫీ ఫీచర్‌ను లాంచ్‌కు ముందే వెల్లడించింది. 120 రెట్లు డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ఈ ఫోన్ పొందుతుంది.

రియల్‌మీ జీటీ 7 ప్రో
రియల్‌మీ జీటీ 7 ప్రో

రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ నవంబర్ 26న ఇండియాలో లాంచ్ అవుతుంది. లాంచ్ తేదీ దగ్గరపడుతుండటంతో కంపెనీ తన ప్రత్యేక ఫీచర్లను బయటపెడుతోంది. ఇప్పుడు కంపెనీ రియల్‌మీ జీటీ 7 ప్రో ఫోటోగ్రఫీ ఫీచర్ లాంచ్ అవుతుంది. 120 రెట్లు డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ఈ ఫోన్ పొందుతుంది. ఈ ఫోన్ వివరాలపై ఓ లుక్కెద్దాం..

రియల్‌మీ జీటీ 7 ప్రోలో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఓఐఎస్, 882ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉన్నాయి. 1/1.95 అంగుళాల సెన్సార్ దాని ధర విభాగంలో అతిపెద్దది, ఉత్తమమైనది. ఏఐ జూమ్ క్లారిటీని జోడించడంతో 120ఎక్స్ డిజిటల్ జూమ్‌లో క్యాప్చర్ చేసిన చిత్రాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అయితే మొట్టమొదటి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్‌తో ఈ ఫోన్ వస్తుంది. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ సహాయంతో కదిలే వస్తువులను క్యాప్చర్ చేయడానికి కస్టమర్లకు అనుమతిస్తుంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్ సహాయంతో స్మార్ట్‌ఫోన్‌ను అన్ లాక్ చేయవచ్చు, టచ్ ద్వారా నీటి అడుగున ఉన్నప్పుడు కెమెరాను నియంత్రించవచ్చు. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉపయోగించి వినియోగదారులు ముందు, వెనుక కెమెరాల మధ్య జూమ్ చేసి మార్చవచ్చని రియల్‌మీ తెలిపింది. జీటీ7 ప్రో 2 మీటర్ల లోతు వరకు నీటిలో 30 నిమిషాల పాటు ఉండగలదని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ ఐపీ69, ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్స్‌తో వస్తోంది.

దీనిలో సోనిక్ వాటర్ డ్రెయినింగ్ స్పీకర్ కూడా ఉంది. ఈ ఫోన్ భూమి, నీటి అడుగున యాక్షన్ కెమెరాగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. అల్ట్రా-హైస్పీడ్ కదిలే వస్తువులను బంధించడానికి షట్టర్ వేగంతో సెకనుకు 10266 చిత్రాలను 30 సెకన్ల వేగంతో సపోర్ట్ చేస్తుంది. ఫొటోలు తీసేటప్పుడు విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను పెంచేందుకు లైవ్ ఫొటోస్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ పొందుతుంది.

Whats_app_banner