Small Savings Schemes : చిన్న మొత్తాల పొదుపు పథకాలు, డిపాజిటర్లకు అందిస్తున్న తాజా వడ్డీ రేట్లు ఇవే
Small Savings Schemes Interest Rates : చిన్న మొత్తాల పొదుపు పథకాలు లేదా పోస్టాఫీస్ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ఈ స్కీమ్స్ లో రిస్క్ తక్కువగా ఉంటుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల తాజా వడ్డీ రేట్లు తెలుసుకుందాం.
Small Savings Schemes Interest Rates : చిన్న మొత్తాల పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం అనేక పొదుపు మార్గాల అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా కాలం చిన్న మొత్తంలో పొదుపు చేసుకునే పథకాలు, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు వంటి బెస్ట్ స్కీమ్స్ ఉన్నాయి. రిస్క్ తక్కువగా తీసుకునే పెట్టుబడిదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), డెట్ మ్యూచువల్ ఫండ్స్, చిన్న మొత్తాల పొదుపు పథకాలు వంటి స్థిర ఆదాయ స్కీమ్స్ ను ఎంచుకుంటారు. వీటిని పోస్టాఫీసు పొదుపు పథకాలు అని కూడా పిలుస్తారు.
చిన్న మొత్తాల్లో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టే పొదుపు పథకాల గురించి మేము మీకు తెలియజేస్తున్నాం. ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ మీకు కచ్చితమైన రాబడిని అందిస్తాయి. రిస్క్, రిటర్న్‌లు ఒకదానితో కలిసి ఉంటాయి. ఎక్కువ రిస్క్ తీసుకుంటే రిటర్న్ లు ఎక్కువ, లేదా నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందని అందరికీ తెలుసు.
చిన్న మొత్తాల పొదుపు పథకాలు-వడ్డీ రేట్లు
1. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ : గరిష్ట పరిమితి లేని ఈ పథకాలలో పెట్టుబడిదారులు కనీసం రూ. 5,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు . రూ. 10,000 వరకు వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సిన అవసరంలేదు. ఈ పథకాలపై ప్రస్తుతం 4 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు.
2. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ : ఒకరు కనీసం రూ.1,000, అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ క్వార్టర్ ప్రాతిపదికన లెక్కిస్తారు. వడ్డీ ఏటా చెల్లిస్తారు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ ప్లాన్ సాధారణ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఇంకా ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లపై అందించే వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఏడాదికి 6.9 శాతం వడ్డీ, రెండేళ్లకు 7 శాతం, మూడేళ్లకు 7.1 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ కు 6.7 శాతం అందిస్తారు.
3. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ : ఖాతాదారు మినిమమ్ రూ. 1,000, మాగ్జిమమ్ రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ క్వార్టర్ కు చెల్లిస్తారు. డిపాజిటర్లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో డిపాజిటర్లకు ఏడాదికి 8.2 శాతం వడ్డీని అందిస్తున్నారు.
4. నెలవారీ ఆదాయ పథకం అకౌంట్ : ఒకే ఖాతాలో కనీసం రూ.1,000, గరిష్టంగా రూ. 4.5 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ. 9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు . ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకాల్లో డిపాజిటర్లకు ఏడాదికి 7.4 శాతం వడ్డీని అందిస్తున్నారు.
5. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ : ఒకరు కనీసం రూ. 1,000, గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. డిపాజిటర్లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందవచ్చు. ఈ పథకాలు డిపాజిటర్లకు సంవత్సరానికి 7.7 శాతం వడ్డీని అందిస్తాయి.
6. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. PPF పై వచ్చే వడ్డీకి ట్యాక్స్ ఉండదు. ఈ పథకాలు డిపాజిటర్లకు సంవత్సరానికి 7.1 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
7. కిసాన్ వికాస్ పత్ర్: కనీసం రూ 1,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి లేదు. మెచ్యూరిటీతో డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ పథకాలు డిపాజిటర్లకు సంవత్సరానికి 7.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
సంబంధిత కథనం