Fixed Deposit Scheme : పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ స్కీమ్.. మీ డబ్బులు డబుల్ చేసే ప్లానింగ్.. 5 లక్షలు పెడితే 10 లక్షలు!-post office fixed deposit scheme make your money double invest 5 lakhs get 10 lakhs check calculation here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fixed Deposit Scheme : పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ స్కీమ్.. మీ డబ్బులు డబుల్ చేసే ప్లానింగ్.. 5 లక్షలు పెడితే 10 లక్షలు!

Fixed Deposit Scheme : పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ స్కీమ్.. మీ డబ్బులు డబుల్ చేసే ప్లానింగ్.. 5 లక్షలు పెడితే 10 లక్షలు!

Anand Sai HT Telugu
Nov 10, 2024 03:30 PM IST

Fixed Deposit Scheme In Post Office : ఫిక్స్‌డ్ డిపాజిట్స్ సురక్షితమైన పెట్టుబడి పథకం. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. పోస్టాఫీస్‌లో మీరు సరైన ప్లానింగ్‌తో ఎఫ్‌డీ చేస్తే డబ్బులను డబుల్ చేసుకోవచ్చు.

పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్
పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ (MINT_PRINT)

పోస్టాఫీసులో పెట్టుబడి పథకాలు చాలానే ఉంటాయి. అనేక మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. రిస్క్ లేకుండా ఉంటుంది. పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ కూడా ఉంటాయి. చాలా మంది ఎఫ్‌డీలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వీటిద్వారా డబ్బులు పెరుగుతాయి. అదే స్టాక్ మార్కెట్‌లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే కొన్నిసార్లు జేబు ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది.

పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ల చాలా మేలు చేస్తాయని చెప్పవచ్చు. దీనిని పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ అని కూడా అంటారు. మీరు హామీతో కూడిన రాబడితో పెద్ద ఫండ్‌ను తయారు చేసుకోవాలనుకుంటే.. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ మీకు బెటర్ ఆప్షన్.

పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ స్పెషల్ ఏంటంటే.. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి మీకు వేర్వేరు సమయ పరిమితులు దొరుకుతాయి. అంటే మీరు పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టే కాలానికి అనుగుణంగా మీకు వడ్డీ లభిస్తుంది. 1,2,3, 5 సంవత్సరాల పాటు డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు.

పోస్టాఫీసు ఎఫ్‌డీ కాలపరిమితి ప్రకారం మాత్రమే రిటర్న్‌లు అందుబాటులో ఉంటాయి. మీరు ఒక సంవత్సరంలో పోస్టాఫీసు ఎఫ్‌డీలో 6.9 శాతం రాబడిని పొందుతారు. అదే సమయంలో రెండు సంవత్సరాల ఎఫ్‌డీలో 7 శాతం, మూడేళ్ల ఎఫ్‌డీలో 7.1 శాతం, ఐదేళ్ల ఎఫ్‌డీలో 7.5 శాతం రాబడి లభిస్తుంది. ఈ పథకం కింద మీరు మీ డబ్బును ఎలా రెట్టింపు చేసుకోవచ్చో ప్లానింగ్ చూడండి..

5 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మీకు 7.5 శాతం వడ్డీ దొరుకుతుంది. పోస్టాఫీసు ఎఫ్‌డీలో 5 ఏళ్ల పాటు రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 7.5 శాతం వడ్డీతో రూ.2,24,974 మీకు వస్తాయి. మెచ్యూరిటీలో రూ. 7,24,974 పొందుతారు. ఇప్పుడు మీరు ఈ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. అది ఎలా అంటే..

మెచ్యూరిటీ సమయంలో వచ్చిన డబ్బును మరో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, 7.5 శాతం చొప్పున 10 సంవత్సరాల తర్వాత రూ. 10,51,175 పొందుతారు. పెట్టుబడిదారులు కోరుకుంటే ఖాతా తెరిచినప్పుడు పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ స్కీమ్‌లో వ్యవధి పొడిగింపు కోసం అభ్యర్థించవచ్చు. ఇది కాకుండా వ్యవధి పూర్తయిన తర్వాత కూడా పథకం వ్యవధిని మరో 5 సంవత్సరాలు పొడిగించమని అభ్యర్థించవచ్చు.

ఇలా చేయడం వలన మీ డబ్బులు డబుల్ అవుతాయి. రూ.5 లక్షల ఇన్వెస్ట్ చేస్తే రూ.10 లక్షలు తీసుకెళ్లొచ్చు.

Whats_app_banner