Multibagger penny stock : ఏడాదిలో 400శాతం పెరిగిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్..!
Multibagger penny stock : మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ గుజరాత్ టూల్‌రూమ్ షేరు.. ఏడాదిలో 400శాతం పెరిగింది! ఫలితంగా.. రూ. 1లక్ష పెట్టుబడిని ఏడాదిలోనే రూ. 5లక్షలకు తీసుకెళ్లింది.
Multibagger penny stock: 'మల్టీబ్యాగర్ స్టాక్'.. ఈ పదం అంటే స్టాక్ మార్కెట్ మదుపర్లకు చాలా ఇష్టం. తక్కువ కాలంలోనే భారీ రిటర్నులు ఇచ్చే ఈ తరహా స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల ఫోకస్ ఎప్పుడు ఉంటుంది. ఒక్కటి తగిలినా.. లైఫ్ సెట్ అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. అంచనాలకు తగ్గట్టుగానే.. ఈ స్టాక్స్ మల్టీఫోల్డ్ రిటర్నులు తెచ్చిపెడతాయి. గుజరాత్ టూల్‌రూమ్ స్టాక్ ఇందుకు తాజా ఉదాహరణ. ఈ స్టాక్.. కేవలం ఏడాది కాలంలో 400శాతం పెరిగింది! పైగా.. ఇదొక పెన్నీ స్టాక్ కావడం విశేషం. వివరాల్లోకి వెళితే..
మల్టీబ్యాగర్ గుజరాత్ టూల్‌రూమ్ పెన్నీ స్టాక్..
దలాల్ స్ట్రీట్ మదుపర్ల ఫోకస్ ఇప్పుడు ఈ గుజరాత్ టూల్‌రూమ్ షేరుపై పడింది. గత కొన్ని రోజులుగా.. ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్స్ హిట్ చేస్తోంది. మంగళవారం ఎర్లీ ట్రేడ్‌లో కూడా అప్పర్ సర్క్యూట్ తగిలింది.
ఏడాది క్రితం రూ. 12.65 వద్ద ఉన్న ఈ గుజరాత్ టూల్‌రూమ్ పెన్నీ స్టాక్.. ఇప్పుడు రూ. 62.28కి చేరింది. అంటే.. ఏడాదిలో 400శాతం పెరిగినట్టు!
Gujarat Toolroom share price : గత నెలలో రోజుల వ్యవధిలో రూ. 57.99 నుంచి రూ. 62.28 వరకు పెరిగింది గుజరాత్ టూల్‌రూమ్ స్టాక్. అంటే 7.5శాతం రిటర్నులు ఇచ్చినట్టు. ఇక మూడు నెలల వ్యవధిలో 24.90 నుంచి రూ. 62.28కు పెరిగిన ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్.. 150శాతం రిటర్నులు తెచ్చిపెట్టింది. 6 నెలల వ్యవధిలో రూ. 13.09 నుంచి రూ. 62.28కు పెరిగింది. అది 300శాతం పెరిగినట్టు! ఇక ఏడాది కాలంలో.. రూ. 12.65 నుంచి రూ. 62.28కు పెరిగింది. ఫలితంగా.. 400శాతం రిటర్నులు తెచ్చిపెట్టునట్టు అయ్యింది.
రూ. 1లక్షలు = రూ. 5 లక్షలు..
స్టాక్ మార్కెట్లో.. గుజరాత్ టూల్‌రూమ్ షేరులో నెల రోజుల క్రితం రూ. 1లక్ష పెట్టి ఉంటే, ఇప్పుడు దాని విలువ రూ. 1,07,500గా ఉండేది. అదే 3 నెలల ముందు రూ.1 లక్ష పెట్టి ఉంటే, దాని విలువ రూ. 2.50లక్షలుగా ఉండేది. 6 నెలల ముందు ఈ మల్టీబ్యాగర్ స్టాక్- గుజరాత్ టూల్‌రూమ్ షేరులో రూ. 1లక్ష పెట్టి ఉంటే, మీ సంపద రూ. 4లక్షలు అయ్యేది. ఏడాది క్రితం రూ. 1లక్ష పెట్టి ఉంటే, ఇప్పుడు మీ సంపద రూ.5 లక్షల వరకు వెళ్లేది.
Multibagger Gujarat Toolroom share price : ఈ గుజరాత్ టూల్‌రూమ్ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ కేవలం బీఎస్ఈలోనే ట్రేడ్‌కు అందుబాటులో ఉంది. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటల్ రూ. 345కోట్లు. స్టాక్ 52 వీక్ హై వచ్చేసి రూ. 62.28. 52వీక్ లో వచ్చేసి రూ. 8.58.
(గమనిక:- ఇది అవగాహన కోసం ప్రచురించిన కథనం మాత్రమే. పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి అంటే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు.. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం
టాపిక్