OnePlus sales : వన్​ప్లస్​ లవర్స్​కి గుడ్​ న్యూస్​! ఇక నుంచి ఆఫ్​లైన్​లో కూడా సేల్స్​..-organized retailers association resumes business with oneplus ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Sales : వన్​ప్లస్​ లవర్స్​కి గుడ్​ న్యూస్​! ఇక నుంచి ఆఫ్​లైన్​లో కూడా సేల్స్​..

OnePlus sales : వన్​ప్లస్​ లవర్స్​కి గుడ్​ న్యూస్​! ఇక నుంచి ఆఫ్​లైన్​లో కూడా సేల్స్​..

Sharath Chitturi HT Telugu
Oct 19, 2024 08:55 AM IST

OnePlus offline sales in India : వన్​ప్లస్​ గ్యాడ్జెట్స్​ ఇక నుంచి ఆఫ్​లైన్​ స్టోర్స్​లో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు తమ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నట్టు సౌత్​ ఇండియన్​ ఆర్గనైజ్​డ్​ రీటైలర్స్​ అసోసియేషన్​ (ఓఆర్​ఏ) ప్రకటించింది.

వన్​ప్లస్​ ఆఫ్​లైన్​ సేల్స్​..
వన్​ప్లస్​ ఆఫ్​లైన్​ సేల్స్​..

వన్​ప్లస్​ లవర్స్​కి గుడ్​ న్యూస్​! దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వన్​ప్లస్​- సౌత్​ ఇండియన్​ ఆర్గనైజ్​డ్​ రీటైలర్స్​ అసోసియేషన్​ (ఓఆర్​ఏ) మధ్య ఉన్న వివాదాలు తొలగిపోయాయి. లో- మార్జిన్​ సహా తమ మధ్య ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకున్నట్టు ఓఆర్​ఏ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది.

"నిర్మాణాత్మక చర్చలు, పరస్పర సహకారంతో ఇప్పటివరకు పెండింగ్​లో ఉన్న సమస్యలను మేము పరిష్కరించుకున్నాము. ఫలితంగా వన్​ప్లస్​తో తాత్కాలికంగా ఉన్న సమస్యలు తొలగిపోయాయి. వన్​ప్లస్​ సంస్థతో కొలాబొరేషన్​ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నాము," అని ఆర్గనైజ్​డ్​ రీటైలర్స్​ అసోసియేషన్​ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఈ నిర్ణయం అక్టోబర్​ 1 నుంచే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది.

తాజా పరిణామాల కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఓఆర్​ఏ సభ్యులు ఇక నుంచి వన్​ప్లస్​ ప్రాడక్ట్స్​ని కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్​ చేసుకోవచ్చు. కస్టమర్లు ఓఆర్​ఏ నెట్​వర్క్​ ద్వారా వన్​ప్లస్​ గ్యాడ్జెట్స్​ని కొనుగోలు చేసుకోవచ్చు.

పండగ సీజన్​ సమయంలో రీటైలై స్టోర్స్​లో వన్​ప్లస్​ సేల్స్​ రీస్టార్ట్​ అవుతుండటం వ్యాపారులకు, కస్టమర్స్​కి మంచి విషయంగా భావిస్తున్నారు. ఇది కస్టమర్స్​కి, రీటైలర్లకు, వన్​ప్లస్​ పార్ట్​నర్స్​కి భారీగా లబ్ధిచేకూరుస్తుందని ఓఆర్​ఏ ఆశాభావం వ్యక్తం చేసింది.

" మా సభ్యులు, కస్టమర్స్​కి సేవలందించేందుకు, మా పార్ట్​న​ర్స్​తో బంధం బలోపేతం చేసుకునేందుకు ఓఆర్​ఏ నిత్యం కృషిచేస్తుంది. వన్​ప్లస్​తో బంధం మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాము," అని సౌత్​ ఇండియన్​ ఆర్గనైజ్​డ్​ రీటైలర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ టీ.ఎస్​ శ్రీధర తెలిపారు.

ఇదీ సమస్య..

వన్​ప్లస్ ప్రాడక్ట్స్​​ ఆఫ్​లైన్​ సేల్స్​ని బహిష్కరించాలని ఈ ఏడాది తొలినాళ్లల్లో ఓఆర్​ఏ కీలక నిర్ణయం తీసుకుంది. మార్జిన్లు తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. సర్వీస్​ క్లెయిమ్స్​, వారెంటీలను వన్​ప్లస్​ సంస్థ ఆలస్యం చేస్తుండటం కూడా ఓఆర్​ఏకి నచ్చలేదు.

దేశవ్యాప్తంగా ఉన్న 4500 స్టోర్స్​లో వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్స్​, వాచ్​లు ఇతర గ్యాడ్జెట్స్​ సేల్స్​ని 2024 మే 1 నుంచి నిలిపివేస్తున్నట్టు ఓఆర్​ఏ గతంలో ప్రకటించింది. ఈ స్టోర్స్​ ఇవి ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్​, కర్ణాటకలో అధికంగా ఉన్నాయి.

ఏడాది కాలంగా ప్రత్యేకంగా వన్​ప్లస్​ ప్రాడక్ట్స్​తో సమస్యలు ఎదురుతున్నాయని ఓఆర్​ఏ గతంలో వెల్లడించింది. సమస్యలను పరిష్కరించేందుకు వన్​ప్లస్​ ముందుకు రావడం లేదని, అందుకే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

రీటైల్​ స్టోర్స్​లో వన్​ప్లస్​ ప్రాడక్ట్స్​ లభించకపోవడంతో చాలా మంది అమెజాన్​ వంటి ఈ-కామర్స్​ సైట్లలో కొనుగోళ్లు చేసుకోవాల్సి వచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం