OnePlus Nord CE 4 Lite vs Poco X6 : రూ. 20వేల బడ్జెట్​లో ఏది బెస్ట్​ స్మార్ట్​ఫోన్​?-oneplus nord ce 4 lite vs poco x6 know which smartphone is better under 20000 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord Ce 4 Lite Vs Poco X6 : రూ. 20వేల బడ్జెట్​లో ఏది బెస్ట్​ స్మార్ట్​ఫోన్​?

OnePlus Nord CE 4 Lite vs Poco X6 : రూ. 20వేల బడ్జెట్​లో ఏది బెస్ట్​ స్మార్ట్​ఫోన్​?

Sharath Chitturi HT Telugu
Jun 30, 2024 08:15 AM IST

OnePlus Nord CE 4 Lite vs Poco X6 : వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 లైట్, పోకో ఎక్స్6 మధ్య స్పెసిఫికేషన్ల పోలికను ఇక్కడ చూడండి. రూ.20,000 ధరలో ఏ స్మార్ట్​ఫోన్​ బెస్ట్​? అనేది తెలుసుకోండి..

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ4
వన్​ప్లస్​ నార్డ్​ సీఈ4 (OnePlus)

వన్​ప్లస్​ తన అఫార్డిబుల్​ స్మార్ట్​ఫోన్​ నార్డ్ సీఈ 4 లైట్​ని ఇటీవల ప్రకటించింది. అయితే ఈ స్మార్ట్​ఫోన్ కొన్ని చిన్న అప్​గ్రేడ్​లను పొందింది. కానీ దాని కొత్త డిజైన్ కారణంగా ఇది ప్రజాదరణ పొందుతోంది. మరోవైపు రూ.20,000 బడ్జెట్​లో స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో అనేక ప్రత్యేకమైన గ్యాడ్జెట్స్​ ఉన్నాయి. ఈ సెగ్మెంట్​లో అద్భుతమైన స్మార్ట్​ఫోన్స్​లో పోకో ఎక్స్ 6 ఒకటి. మరి ఈ రెండింట్లో ఏది కొనాలి? ఏది వాల్యూ ఫర్​ మనీ? వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 లైట్, పోకో ఎక్స్6 స్మార్ట్​ఫోన్స్​ని పోల్చి ఏది బెస్ట్​? ఏది ఫీచర్​ లోడెడ్​? అనేది ఇక్కడ తెలుసుకుందాము..

వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 లైట్ వర్సెస్ పోకో ఎక్స్6..

డిస్​ప్లే: వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 లైట్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2100నిట్స్ బ్రైట్నెస్​తో 6.67 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే కలిగి ఉంది. వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్​ క్వా టచ్ టెక్నాలజీని కూడా అందిస్తుంది. పోకో ఎక్స్6 విషయానికి వస్తే.. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800నిట్స్ పీక్ బ్రైట్నెస్​తో కూడిన 6.67 ఇంచ్​ ఓఎల్ఈడీ డిస్​ప్లే అందించారు.

కెమెరా: వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 లైట్​లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. పోకో ఎక్స్6లో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.

ఇదీ చూడండి:- Redmi Note 14 Pro : రెడ్​మీ నోట్​ 14 ప్రో.. లాంచ్​కి ముందే ఫీచర్స్​ లీక్​!
 

పర్ఫార్మెన్స్​: పనితీరు పరంగా, వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 లైట్ స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్​తో 8 జీబీ ఎల్పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్- 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్​తో పనిచేస్తుంది. పోకో ఎక్స్6లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్, ఎల్పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉన్నాయి.

బ్యాటరీ : వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 లైట్​ స్మార్ట్​ఫోన్​లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పోకో ఎక్స్6లో 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

ధర: ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో రూ.20,000 ధర పరిధిలో ఉన్నాయి. అయితే రూ.1000 వ్యత్యాసం ఉంది. వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 లైట్ ప్రారంభ ధర రూ.19,999 కాగా, పోకో ఎక్స్6 ధర రూ.18,999గా ఉంది.

మరి ఈ రెండింటిలో మీకు ఏది నచ్చింది? మీరు వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4 లైట్​ కొంటారా? లేక పోకో ఎక్స్​6 కొంటారా?

మరో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం మన హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి.

Whats_app_banner

సంబంధిత కథనం