NTPC Green Energy IPO: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ జీఎంపీ, ఇతర వివరాలు; అప్లై చేయొచ్చా?
NTPC Green Energy IPO: ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఎదురు చూస్తున్న ఐపీఓ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ. ఎన్ టీపీసీ కి 100 శాతం సబ్సిడయిరీ గా ఉన్నఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ త్వరలో ప్రైమరీ మార్కెట్లోకి రానుంది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను ఒక్కో షేరుకు రూ.102 నుంచి రూ.108 మధ్య నిర్ణయించింది.
NTPC Green Energy IPO: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఐపీవో నవంబర్ 19న, మంగళవారం బిడ్డింగ్ కోసం ఓపెన్ అవుతోంది. ఈ ఐపీఓకు నవంబర్ 22, శుక్రవారం వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.102 నుంచి రూ.108 మధ్య నిర్ణయించింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ కోసం యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయింపులు నవంబర్ 18 సోమవారం జరగనున్నాయి. ఫ్లోర్ ప్రైస్, క్యాప్ ప్రైస్ వరుసగా ఈక్విటీ షేర్ల ముఖ విలువకు 10.20 రెట్లు, 10.80 రెట్లు ఉన్నాయి.
ఒక్కో లాట్ లో138 ఈక్విటీ షేర్లు
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ కు లాట్స్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ లో 138 ఈక్విటీ షేర్లు ఉంటాయి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ పబ్లిక్ ఇష్యూలో 75 శాతం వాటాలను క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB)కు, 15 శాతానికి మించకుండా నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII) కేటాయించింది. 20 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను కంపెనీ ఉద్యోగులకు రిజర్వ్ చేశారు. అర్హులైన ఉద్యోగులకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.5 డిస్కౌంట్ ఇస్తున్నారు.
నవంబర్ 25న షేర్ల కేటాయింపు
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ షేర్ల కేటాయింపు నవంబర్ 25వ తేదీ సోమవారం ఖరారు అవుతుంది. నవంబర్ 26వ తేదీ మంగళవారం కంపెనీ రీఫండ్స్ ప్రారంభిస్తుంది. రీఫండ్ చేసిన మరుసటి రోజే షేర్లు అలాట్ అయినవారి డీమ్యాట్ అకౌంట్లలోకి షేర్లు డిపాజిట్ చేస్తారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేరు ధర నవంబర్ 27 బుధవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వివరాలు
2024 ఆర్థిక సంవత్సరానికి నిర్వహణ సామర్థ్యం, విద్యుత్ ఉత్పత్తి పరంగా పునరుత్పాదక శక్తి (హైడ్రో మినహా) లో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎన్టీపీసీ ప్రమోట్ చేసిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గుర్తింపు పొందింది. జూన్ 30, 2024 నాటికి, ఎన్టీపీసీ గ్రీన్ 37 సోలార్ ప్రాజెక్టులు, 9 పవన ప్రాజెక్టులలో 15 ఆఫ్ టేకర్స్ తో కలిసి పనిచేస్తోంది. ఇది 7 రాష్ట్రాల్లో 31 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను నిర్మించే ప్రక్రియలో ఉంది. మొత్తం 11,771 మెగావాట్ల ఒప్పందాలు ఉన్నాయి. అంతేకాకుండా 14 సోలార్ ప్రాజెక్టులు, 2 పవన ప్రాజెక్టుల ద్వారా 2,925 మెగావాట్ల విద్యుత్ ను నిర్వహిస్తోంది.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆదాయం
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 2022 ఆదాయం ఆర్థిక సంవత్సరంలో రూ.910.42 కోట్ల నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1,962.60 కోట్లకు పెరిగింది. ఇది 46.82 శాతం ఆదాయ వృద్ధి రేటు. పన్ను అనంతర లాభం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.94.74 కోట్ల నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.344.72 కోట్లకు, అంటే 90.75 శాతం పెరిగింది. 2024 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో నిర్వహణ ఆదాయం రూ.578.44 కోట్లకు చేరుకోగా, పన్ను అనంతర లాభం రూ.138.61 కోట్లుగా ఉంది.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో జీఎంపీ
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ షేర్లు నవంబర్ 13, మంగళవారం గ్రే మార్కెట్లో రూ. 5 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఐపీఓ మార్కెట్లోకి రావడానికి మరో వారం సమయం ఉన్నందున ఈ జీఎంపీ (GMP) మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. కాగా, రూ.10,000 కోట్ల విలువైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓలో కొత్తగా జారీ చేసిన ఈక్విటీ షేర్లు మాత్రమే ఉంటాయి. ఈ కొత్త ఇష్యూ ద్వారా వచ్చే మొత్తం రూ.7,500 కోట్లను ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (NREL)లో పెట్టుబడులు, ఎన్ఆర్ఈఎల్ కు సంబంధించిన కొన్ని ప్రస్తుత రుణాలను తిరిగి చెల్లించడం, అలాగే సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వెచ్చించనున్నారు. ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఈ ఆఫర్ కు రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తున్నాయి.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకింగ్ కంపెనీలవి. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.