తెలుగు న్యూస్ / ఫోటో /
మరో నాలుగు రోజుల్లో ఈ మూడు రాశుల వారికి అదృష్ట కాలం మొదలు.. మెరుగ్గా ఆదాయం, ఆరోగ్యం!
- సూర్యుడు ఈవారంలోనే రాశి మారనున్నాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం దక్కనుంది. ప్రయోజనాలు పొందుతారు. ఆ వివరాలివే..
- సూర్యుడు ఈవారంలోనే రాశి మారనున్నాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం దక్కనుంది. ప్రయోజనాలు పొందుతారు. ఆ వివరాలివే..
(1 / 5)
గ్రహాల రారాజు సూర్యుడి సంచారం రాశుల అదృష్టాన్ని మార్చేస్తుంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడి సంచారానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం తులారాశిలో ఉన్న సూర్యుడు ఈ వారంలోనే వేరే రాశిలోకి మారనున్నాడు.
(2 / 5)
మరో నాలుగు రోజుల్లో అంటే నవంబర్ 16వ తేదీన ఉదయం 7.14 గంటలకు సూర్యుడు.. వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. డిసెంబర్ 15వ తేదీన వరకు వృశ్చిక రాశిలోనే సూర్యుడు సంచరిస్తాడు. ఈ సంచారం వల్ల మూడు రాశుల వారికి ఎక్కువగా లక్ కలిసిరానుంది.
(3 / 5)
మకరం: ఈ కాలంలో మకరరాశి వారి అదృష్టం మారుతుంది. సూర్యుడి అనుగ్రహం వీరికి ఉంటుంది. ఈ కాలంలో ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పెరుగుతుంది.
(4 / 5)
తుల: వృశ్చికంలో సూర్యుడు సంచారించే కాలంలో తుల రాశి వారికి టైమ్ కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరి కుటుంబంలో బంధాలు బలపడతాయి. సమాజంలో ప్రతిష్ఠ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆత్మవిశ్వాసం కూడా మెండుగా ఉంటుంది.
(5 / 5)
కుంభం: ఈ కాలంలో కుంభ రాశి వారికి శుభాలు కలుగుతాయి. ఉద్యోగులకు సహచరుల నుంచి మద్దతు పెరుగుతుంది. వీరి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు పదోన్నతి పెండింగ్‍లో ఉంటే అది మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనపరంగా కూడా లాభాలు చేకూరొచ్చు. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి నిర్దిష్టమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల గురించి సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు