Nokia G60 5G Sale: నోకియా జీ60 5జీ సేల్ నేటి నుంచే.. పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలివే -nokia g60 5g first open sale today know specifications price full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nokia G60 5g Sale: నోకియా జీ60 5జీ సేల్ నేటి నుంచే.. పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలివే

Nokia G60 5G Sale: నోకియా జీ60 5జీ సేల్ నేటి నుంచే.. పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలివే

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 03:47 PM IST

Nokia G60 5G price in india: నోకియా జీ60 5జీ ఫోన్ నేడు తొలిసారి సేల్‍కు రానుంది. 120హెర్ట్జ్ ఫుల్ హెచ్‍డీ ప్లస్ డిస్‍ప్లేను ఈ మొబైల్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Nokia G60 5G: నోకియా జీ60 5జీ మోడల్ లాంచ్ చేసిన నోకియా
Nokia G60 5G: నోకియా జీ60 5జీ మోడల్ లాంచ్ చేసిన నోకియా (nokia)

Nokia G60 5G Price, Sale: నోకియా జీ60 5జీ స్మార్ట్ ఫోన్ నేడు (నవంబర్ 8) తొలిసారి సేల్‍కు రానుంది. భారత్‍లో గత వారం లాంచ్ అయ్యాక ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ మొదలుకాగా.. ఇప్పుడు ఓపెన్ సేల్‍కు మొదటిసారి అందుబాటులోకి వస్తోంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే ఫుల్ హెచ్‍డీ ప్లస్ డిస్‍ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. నోకియాNokia G60 5G జీ60 5జీ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, సేల్ వివరాలను ఇక్కడ చూడండి.

Nokia G60 5G Specifications: నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్లు

నోకియా జీ60 5జీ ఫోన్‍లో క్వాల్‍కామ్ స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‍ను కలిగి ఉంది. 6.58 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో ఈ మొబైల్ వస్తోంది. డిస్‍ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 120హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్‍ బ్రైట్‍నెస్ ఉంటాయి.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‍‍పై నోకియా జీ60 5జీ రన్ అవుతోంది. మూడు సంవత్సరాల పాటు ఈ మొబైల్‍కు ఆపరేటింగ్ సిస్టమ్‍ అప్‍డేట్స్ అందించనున్నట్టు నోకియా పేర్కొంది.

నోకియా జీ60 5జీ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది.

4500ఎంఏహెచ్ బ్యాటరీని నోకియా జీ60 5జీ కలిగి ఉంది. 20 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మొత్తంగా ఈ ఫోన్ 190 గ్రాముల బరువు ఉంటుంది.

Nokia G60 5G: నోకియా జీ60 5జీ ధర, సేల్

నోకియా జీ60 5జీ ఒకే వేరియంట్‍లో అందుబాటులోకి వచ్చింది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.29,999గా ఉంది. నోకియా ఇండియా వెబ్‍సైట్‍లో నేడు ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది. బ్లాక్, ఐస్ కలర్ ఆప్షన్‍లలో నోకియా జీ60 5జీ లభిస్తుంది. ఈ ఫోన్‍కు రెండు సంవత్సరాల వారెంటీని నోకియా ఇస్తోంది.

స్పెసిఫికేషన్లపరంగా చూస్తే రూ.30వేల రేంజ్‍లో నోకియా జీ60 5జీ అంత ఆకర్షణీయంగా లేదని అనిపించొచ్చు. అయితే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్, ఈ-సిమ్ సపోర్ట్, మూడు సంవత్సరాల ఓఎస్ అప్‍డేట్స్, రెండు సంవత్సరాల వారెంటీ ఈ మొబైల్‍కు ప్రత్యేకతలుగా ఉన్నాయి. నోకియాకు చెందిన 5జీ ఫోనే కావాలనుకునే వారు పరిగణనలోకి తీసుకోవచ్చు.

WhatsApp channel