Maruti Suzuki Dzire : సరికొత్త అవతారంలో బెస్ట్ ఫ్యామిలీ కారు- లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
2024 Maruti Suzuki Dzire బెస్ట్ సెల్లింగ్, మిడిల్‌క్లాస్ వారికి ప్రియమైన వెహికిల్‌గా గుర్తింపు పొందిన మారుతీ సుజుకీ డిజైర్‌కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రాబోతోందన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మోడల్ లాంచ్ డేట్‌ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలు..
2024లో మచ్ అవైటెడ్ వెహికిల్స్‌లో మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ ఒకటి. ఇక ఎట్టకేలకు ఈ మోడల్ లాంచ్‌ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ననవంబర్ 11న 2024 మారుతీ సుజుకీ డిజైర్ లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో ఈ బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ కారుపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
2024 మారుతి సుజుకి డిజైర్: ఎక్ట్సీరియర్
మారుతీ సుజుకీ స్విఫ్ట్‌తో ప్రస్తుత జనరేషన్ డిజైర్‌కి చాలా పోలీకలు ఉంటాయి. అయితే న్యూ జనరేషన్లో భారీ మార్పులే జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజా స్పై షాట్స్ ఆధారంగా రాబోయే మారుతీ సుజుకీ డిజైర్ మరింత దృఢమైన డిజైన్ సౌందర్యాన్ని కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇందులో అనేక హారిజాంటల్ క్రోమ్ స్లాట్లతో అలంకరించిన పెద్ద గ్రిల్, డే టైమ్ రన్నింగ్ లైట్లు (డీఆర్ఎల్), ఫాగ్ లైట్లతో కూడిన అప్డేటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. అదనంగా, కాంపాక్ట్ సెడాన్ కొత్త అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్లైట్లతో రీడిజైన్ చేసిన రేర్ భాగం, షార్క్-ఫిన్ యాంటెనాను కలిగి ఉంటుంది.
2024 మారుతీ సుజుకీ డిజైర్: ఇంజిన్..
మారుతీ సుజుకీ డిజైర్ నెక్ట్స్ జనరేషన్.. కొత్తగా విడుదలైన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. ఫలితంగా ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్ 1.2-లీటర్, మూడు సిలిండర్ల జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ని కలిగి ఉన్న రెండొవ వాహనంగా మారుతుంది. స్విఫ్ట్‌లో ఈ ఇంజిన్ గరిష్టంగా 80బీహెచ్పీ పవర్, 112ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుబాటులో ఉన్న ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టీ వేరియంట్లు ఉన్నాయి. ఇందులో సీఎన్జీ ఇంజిన్ కూడా ఉండనుందని సమాచారం.
2024 మారుతీ సుజుకీ డిజైర్: ఇంటీరియర్..
2024 మారుతీ సుజుకీ డిజైర్ ఇంటీరియర్ గణనీయమైన రీడిజైన్‌ని పొందే అవకాశం ఉంది. ఇందులో 360-డిగ్రీల కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వాహనంలో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు అనుకూలమైన ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, స్పోర్టీ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. హెడ్-అప్ డిస్ప్లే, సొగసైన డ్యూయల్-టోన్ బీజ్, బ్లాక్ ఇంటీరియర్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇండియాలో మిడ్క్లాస్, బెస్ట్ సెల్లింగ్ వాహనాల్లో ఒకటి ఈ మారుతీ సుజుకీ డిజైర్. ఇక ఇప్పుడు దీని ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ధర, ఇతర ఫీచర్స్‌తో పాటు మరిన్ని వివరాలపై లాంచ్ సమయానికి ఒక క్లారిటీ వస్తుంది. ఆ వివరాలను మేము మీకు అప్డేట్ చేస్తాము.
సంబంధిత కథనం