Netflix password Sharing : ఇక నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్​ షేరింగ్​ బంద్​.. త్వరలోనే అమల్లోకి!-netflix password sharing to stop after april 2023 this is what happens next ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Netflix Password Sharing : ఇక నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్​ షేరింగ్​ బంద్​.. త్వరలోనే అమల్లోకి!

Netflix password Sharing : ఇక నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్​ షేరింగ్​ బంద్​.. త్వరలోనే అమల్లోకి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 27, 2023 11:24 AM IST

Netflix password Sharing : మీరు మీ ఫ్రెండ్స్​తో నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్​ను షేర్​ చేసుకుంటున్నారా? అయితే మీకు బ్యాడ్​ న్యూస్​. త్వరలో పాస్​వర్డ్​ షేరింగ్​కు ముగింపు పడనుంది!

ఇక నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్​ షేరింగ్​ బంద్
ఇక నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్​ షేరింగ్​ బంద్ (REUTERS)

Netflix password Sharing India : ప్రముఖ స్ట్రీమింగ్​ సంస్థ నెట్​ఫ్లిక్స్​కు.. 'పాస్​వర్డ్ షేరింగ్'​ అనేది తలనొప్పిగా మారిందన్న విషయం తెలిసినదే. ఇవాళో.. రేపో.. ఈ వ్యవహారంపై నెట్​ఫ్లిక్స్​ కఠిన నిబంధనలు తీసుకొస్తుందని ఊహాగానాలు జోరుగా సాగాయి. ఈ ఊహాగానాలను నెట్​ఫ్లిక్స్​ నిజం చేసింది! పాస్​వర్డ్​ షేరింగ్​ను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు ప్రకటించింది నెట్​ఫ్లిక్స్​. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

నెట్​ఫ్లిక్స్​ పెయిడ్​ షేరింగ్​ మోడల్​..

ఒక అకౌంట్​ మీద చాలా మంది, చాలా డివైజ్​లలో నెట్​ఫ్లిక్స్​ను యాక్సిస్​ చేస్తూ ఉంటారు. పాస్​వర్డ్​ షేరింగ్​ వెసులుబాటు ఉండటం ఇందుకు కారణం. ఇండియాలో ఇది సాధారణ విషయమే. దీంతో తమకు నష్టం జరుగుతోందని నెట్​ఫ్లిక్స్​ భావిస్తోంది. అందుకే.. 'పెయిడ్​ షేరింగ్​ మోడల్​'ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. 2023 ఏప్రిల్​ నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Netflix password Sharing rules : "క్యూ1 తర్వాత.. పెయిడ్​ షేరింగ్​ మోడల్​ను అమల్లోకి తీసుకొస్తాము," అని నెట్​ఫ్లిక్స్​ తమ ఇన్​వెస్టర్లకు వెల్లడించింది. అంటే.. ఏప్రిల్​ నుంచి నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్​ షేరింగ్​ పనిచేయదు. నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్​ షేర్​ చేసే వాళ్లు.. ఇక నుంచి అదనంగా డబ్బులు కట్టాల్సిందే!

Netflix OTT Subscription Plans: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఈ మోడల్​లో భాగంగా.. సబ్​స్క్రిప్షన్​కి తగ్గట్టు.. యూజర్ల డివైజ్​లను రివ్యూ చేసుకునే ఆప్షన్​ ఇస్తుంది నెట్​ఫ్లిక్స్​. వాటిల్లోనే నెట్​ఫ్లిక్స్​ పనిచేస్తుంది! దీనితో పాటు.. కొత్త అకౌంట్​లకు తమ ప్రొఫైల్స్​ మార్చుకునే వెసులుబాటును కూడా ఇస్తుంది.

Netflix paid sharing model : "పెయిడ్​ షేరింగ్​ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత. యూజర్లు.. పాస్​వర్డ్​ను షేర్​ చేయాలంటే అదనంగా డబ్బులు కట్టాల్సిందే. దీనిపై షార్ట్​ టర్మ్​లో ప్రతికూల ప్రభావం పడొచ్చు. కానీ క్రమంగా సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి. మేము డెలివరీ చేసే ప్రొగ్రామ్​లపై మాకు నమ్మకం ఉంది. వాటిని చూసేందుకు.. ఇంతకాలం నెట్​ఫ్లిక్స్​ అకౌంట్​లను అప్పుగా తీసుకున్న వారు.. భవిష్యత్తులో కొత్త అకౌంట్​లు తీసుకుంటారు," అని నెట్​ఫ్లిక్స్​ పేర్కొంది.

పాస్​వర్డ్​ షేరింగ్​ బంద్​..

పెయిడ్​ షేరింగ్​ మోడల్​లో భాగంగా.. ఐపీ అడ్రెస్​లు, డివైజ్​ ఐడీలు, నెట్​ఫలిక్స్​ అకౌంట్​ యాక్టివీటీలు వంటిని పరిశీలిస్తుంది నెట్​ఫ్లిక్స్​. ఫలితంగా బయట వ్యక్తులు లాగిన్​ అవ్వకుండా చేస్తుంది!

Netflix India news : ఈ పెయిడ్​ షేరింగ్​ మోడల్​పై రానున్న రోజుల్లో నెట్​ఫ్లిక్స్​ నుంచి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇండియా, ఇండియా యూజర్లపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం