Netflix plans : నెట్​ఫ్లిక్స్​ కస్టమర్లకు షాక్​..! త్వరలోనే భారీగా పెరగనున్న సబ్​స్క్రిప్షన్​ ధరలు!-netflix could raise subscription cost of its ad free plans check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Netflix Plans : నెట్​ఫ్లిక్స్​ కస్టమర్లకు షాక్​..! త్వరలోనే భారీగా పెరగనున్న సబ్​స్క్రిప్షన్​ ధరలు!

Netflix plans : నెట్​ఫ్లిక్స్​ కస్టమర్లకు షాక్​..! త్వరలోనే భారీగా పెరగనున్న సబ్​స్క్రిప్షన్​ ధరలు!

Sharath Chitturi HT Telugu
Oct 17, 2023 06:12 AM IST

Netflix plans : నెట్​ఫ్లిక్స్​ సంస్థ.. తన సబ్​స్క్రిప్షన్​ ధరలను పెంచే అవకాశం ఉంది. ఇంకొన్ని రోజుల్లో ఓ ప్రకటన వెలువడొచ్చు.

త్వరలోనే భారీగా పెరగనున్న సబ్​స్క్రిప్షన్​ ధరలు
త్వరలోనే భారీగా పెరగనున్న సబ్​స్క్రిప్షన్​ ధరలు (REUTERS)

Netflix plans hike : మీరు నెట్​ఫ్లిక్స్​ను ఎక్కువగా ఉపయోగిస్తారా? అయితే మీకు ఒక షాకింగ్​ వార్త! ఈ ఓటీటీ ప్లాట్​ఫామ్​కు చెందిన సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​ ధరలు త్వరలోనే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎంత పెరుగుతాయి..?

ఈ ఏడాదిలో ఇప్పటివరకు.. పాస్​వర్డ్​- షేరింగ్​ను నియంత్రించడంపైనే అధికంగా దృష్టిపెట్టింది నెట్​ఫ్లిక్స్​. అందుకే ఇప్పటివరకు ప్లాన్స్​ ధరలను పెంచలేదు. అయితే.. ఈ పాస్​వర్డ్​ షేరింగ్​ని కట్​ చేయడంతో గత త్రైమాసికంలో సంస్థ.. 6 మిలియన్​ సబ్​స్క్రైబర్స్​ను వెనకేసుకుందట!

ఇక ఇప్పుడు.. యాడ్​-ఫ్రీ ఆప్షన్స్​లోని ప్లాన్స్​కు చెందిన ధరలను పెంచే యోచనలో నెట్​ఫ్లిక్స్​ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారంలో సంస్థ.. తన త్రైమాసిక ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఫలితాలతో పాటు ధరల పెంపును కూడా ప్రకటించే అవకాశం ఉందని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ.. తన నివేదికలో పేర్కొంది.

Netflix plans increase : వాల్ట్​ డిస్నీ వంటి అనేక ఓటీటీ సంస్థలు.. ఈ ఏడాదిలో ఇప్పటికే అనేకమార్లు ధరలను పెంచేశాయి. కానీ నెట్​ఫ్లిక్స్​ ఇంకా ప్రైజ్​ హైక్​ తీసుకోలేదు. 100 మిలియన్​ వ్యూవర్స్​ని సంపాదించుకోవాలన్న టార్గెట్​ పెట్టుకుని ముందుకెళ్లింది.

అయితే.. ఇలా యాడ్​ ఫ్రీ ప్లాన్స్​కు చెందిన ధరలను పెంచితే.. యూజర్లు యాడ్​ ఆధారిత ప్లాన్స్​కు షిఫ్ట్​ అవుతారని సంస్థ భావిస్తోంది. నిజంగా ఇదే జరిగితే.. సంస్థకు ఇక పండుగే! కమర్షియల్​గానూ సంస్థ భారీ మొత్తంలో రెవెన్యూను సంపాదించుకోవచ్చు.

Netflix subscription plans hike : ప్రస్తుతం.. స్టాండర్డ్​ యాడ్​-ఫ్రీ ప్లాన్స్​ ధర నెలకు 15.49 డాలర్లుగాను.. యాడ్స్​ను సపోర్ట్​ చేసే ప్లాన్స్​ ధర నెలకు 6.99డాలర్లుగాను ఉంది. పాస్​వర్డ్​ షేరింగ్​ను నియంత్రించిన తర్వాత.. చాలా మంది కొత్త సబ్​స్క్రైబర్లు.. యాడ్​-ఫ్రీ ప్లాన్స్​వైపే మొగ్గుచూపారు.

ఇక ఇంతకాలం స్ట్రైక్​లో ఉన్న హాలీవుడ్​ రైటర్స్​ కూడా ఇప్పుడు తిరిగి పనిలోకి వస్తున్నారు. మంచి మంచి కంటెంట్​ వస్తుందని కస్టమర్లు భావిస్తున్నారు. ఈ సమయంలోనే ప్లాన్స్​ ధరలను పెంచితే బాగుంటుందని నెట్​ఫ్లిక్స్​ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

త్రైమాసిక ఫలితాలు ఎలా ఉంటాయి?

నెట్​ఫ్లిక్స్​ మూడో త్రైమాసిక (ఆగస్ట్​-అక్టోబర్​) ఫలితాలపై మార్కెట్​ వర్గాలో భారీ అంచనాలే ఉన్నాయి. రెవెన్యూ 7.7శాతం వృద్ధిచెంది 8.54 బిలియన్​ డాలర్లుగా నమోదవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం