November car launches : నవంబర్‌లో కార్స్ లాంచ్ లిస్ట్.. మామూలుగా లేదుగా!
November car launches in India : నవంబర్‌లో పలు ఆటో సంస్థలు.. కొత్త కార్లు, కొత్త వేరియంట్లతో ముందుకు రానున్నాయి. వాటి వివరాలను ఓసారి చూద్దాం..
November car launches in India : పండుగ సీజన్లో ఆటో సంస్థలకు అదిరిపోయే గిరాకీ లభించిందని వార్తలు వస్తున్నాయి. ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను వివిధ ఆటో సంస్థలు ఆకట్టుకున్నట్టు మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఇక ఇంకొన్ని రోజుల్లో దేశంలో పండుగ సీజన్ ముగుస్తుంది. కానీ ఆటో సంస్థలు మాత్రం 'తగ్గేదే లే!' అన్న రీతిలో ఉన్నాయి. ఇయర్ ఎండింగ్ వరకు కొత్త కార్లు, సరికొత్త వేరియంట్లతో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు ప్రణాళికలు రచించాయి. ఇందులో భాగంగా.. వచ్చే నెలలో దేశంలో విడుదలయ్యే కొత్త కార్లను ఓసారి పరిశీలిద్దాం..
ట్రెండింగ్ వార్తలు
ఎంజీ హెక్టార్ 2022
MG Hector 2022 : న్యూ జనరేషన్ హెక్టార్ ఎస్‌యూవీని నవంబర్‌లో లాంచ్ చేస్తున్నట్టు ఎంజీ మోటార్ ఇప్పటికే ప్రకటించేసింది. కొత్త వాహనానికి సంబంధించిన అనేక ఫీచర్లను సైతం టీజర్ల రూపంలో బయటకు తీసుకొచ్చింది. నవంబర్ మధ్యలో కొత్త కార్ లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతిపెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఈ కారులో ఉండనుంది. 14ఇంచ్ టచ్ స్క్రీన్ ఇందులో ఉంటుంది. ఎంజీ నెక్స్ట్ జనరేషన్ ఐస్మార్ట్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి ఫీచర్స్ ఇందులో ఉండనున్నట్టు తెలుస్తోంది.
జీప్ గ్రాండ్ చెరోకీ..
Jeep Grand Cherokee : ఫిప్త్ జనరేషన్ జీప్ గ్రాండ్ చెరోకి.. ఇండియా మార్కెట్లో వచ్చే నెలలో రానుంది! ఇందుకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే విడుదల చేసింది జీప్ ఇండియా. అంతర్జాతీయంగా గ్రాండ్ చెరోకీలో 5.7లీటర్ వీఇంజిన్ ఉంటుంది. జీప్ గ్రాండ్ చెరోకీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీవైడీ అట్టో 3..
BYD Atto 3 : చైనాకు చెందిన ఈవీ కార్ మేకర్ బీవైడీ ఇండియా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు కొంతకాలం క్రితం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ అట్టో 3ని లాంచ్ చేయనుంది. ఇందుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే మొదలైపోయాయి. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో డెలివరీ షురూ అవుతుంది. నవంబర్ చివర్లో.. ఈ వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తుంది బీవైడీ. లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ ఫీచర్ ఈ కారులో ఉంది. సేఫ్టీ విషయంలో యూరో ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో.. వాహనానికి 5స్టార్ రేటింగ్ లభించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఎస్యూవీ 400కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెప్పింది.
టయోటా ఇన్నోవా హైక్రాస్..
Toyota Innova HyCross : ఇన్నోవా హైక్రాస్‌ను ఇండియాలో లాంచ్ చేసేందుకు టయోటా సన్నద్ధమవుతోంది. నివేదికల ప్రకారం.. ఈ కారు వచ్చే నెలలో లాంచ్ అవుతుంది. ఇండియా రోడ్లు మీద ఈ కారు టెస్టింగ్ ఇటీవలే ముగిసింది.
మారుతీ సుజుకీ బలెనో సీఎన్జీ..
Maruti Suzuki Baleno CNG : న్యూ జనరేషన్ బలెనోను ఈ ఏడాదిలో లాంచ్ చేసింది మారుతీ సుజుకీ. ఇక ఇప్పుడు దాని సీఎన్జీ వర్షెన్‌ని లాంచ్ చేసేందుకు చూస్తోంది. అయితే దీనిపై మారుతీ సుజుకీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మార్కెట్లో మాత్రం.. వచ్చే నెలలో ఇది లాంచ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. మారుతీ సుజుకీకి ఇప్పటికే.. వాగన్ఆర్, సెలెరోలో సీఎన్జీ వర్షెన్లు ఉన్నాయి. లాంచ్ అయ్యాక.. మారుతీ సుజుకీ బలెనో సీఎన్జీ.. టాటా టియాగో సీఎన్జీకి గట్టి పోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం
Maruti Suzuki S-Cross కారు మాయం.. ఎందుకు, ఏమిటి, ఎలా?
October 10 2022
Maruti Suzuki Grand Vitara : మార్కెట్లోకి గ్రాండ్ విటారా- ధర ఎంతంటే..!
September 26 2022