Jeep Grand Cherokee : జీప్ గ్రాండ్ చెరోకీ.. ఇండియాలో లాంచ్‌కి సిద్ధం
Jeep Grand Cherokee India launch : జీప్ గ్రాండ్ చెరోకీ.. ఇండియాలో వచ్చే నెల లాంచ్ కానుంది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలు మీకోసం..
Jeep Grand Cherokee India launch : జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్యూవీ.. ఇండియాలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని జీప్ ఇండియా సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఫిఫ్త్ జనరేషన్ గ్రాండ్ చెరోకీ ఎస్‌యూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. వచ్చే నెలలో ఇది ఇండియాలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. జీప్ ఇండియా లైనప్‌లో గ్రాండ్ చెరోకీ.. నాలుగో ఎస్యూవీ.
‘ది బెస్ట్ ఎస్యూవీ’
కంపాస్, వ్రాంగ్లర్, మెరీడియన్ పేర్లతో జీప్ ఇండియాకు చెందిన మూడు ఎస్‌యూవీలు దేశంలో ఉన్నాయి. మెరీడియన్ని ఇటీవలే లాంచ్ చేశారు. ఈ మూడు.. టయోటా ఫార్చునర్కి తీవ్ర పోటీనిస్తున్నాయి.
Jeep Grand Cherokee : అయితే.. వీటన్నింటిలోకి.. జీప్ గ్రాండ్ చెరోకీ అత్యంత ప్రత్యేకంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ గ్రాండ్ చెరోకీని.. అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారిగా 1992లో లాంచ్ చేశారు. అనేక ఏళ్ల పాటు.. బెస్ట్ ఎస్‌యూవీగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇందులోని లేటెస్ట్ ఎడిషన్.. గతేడాది మార్కెట్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది హైబ్రీడ్ ఆప్షన్లో కూడా లభిస్తోంది. మరి ఇండియాలో హైబ్రీడ్ వర్షెన్ లాంచ్ అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.
అంతర్జాతీయ మార్కెట్లో.. జీప్ గ్రాండ్ చెరోకీలో 5.7లీటర్ వీ8 ఇంజిన్ ఉంది. ఇది 357 బీహెచ్పీతో 528 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయగలదు. 2.0 లీటర్ టర్బోఛార్జ్ పెట్రోల్ మోటార్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ఇది 375 బీహెచ్పీతో 637 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయగలదు. అంతేకాకుండా 3.6లీటర్ వీ6 పెట్రోల్ మోటార్లో 294హెచ్పీతో 348ఎన్ఎం టార్క్ జనరేట్ ఉత్పత్తి చేస్తుంది.
జీప్ గ్రాండ్ చెరోకీ ఫీచర్స్..
Jeep India : జీప్ గ్రాండ్ చెరోకీ కొత్త వర్షెన్.. పాత వాటితో పోలి ఉంటుంది. కానీ ఇందులో అపియరెన్స్ చాలా మెరుగ్గా ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్‌ని అప్డేట్ చేశారు. ఎల్ఈడీ హెడ్ లైట్ యూనిట్స్ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఇక జీప్ గ్రాండ్ చెరోకీ లోపలి భాగం మరింత లేటెస్ట్గా ఉంది. టూ రో వర్షెన్ కన్నా త్రీ రో వర్షెన్ పెద్దగా కనిపిస్తుంది. 10.25ఇంచ్ స్క్రీన్, యాపిల్కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. వెనకాల కూర్చునే వారి కోసం ప్రత్యేకంగా స్క్రీన్లు పెట్టారు. స్ట్రీమింగ్ సైట్స్ కూడా ప్లే అయ్యే విధంగా.. ఈ కారులో 4జీ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. 19స్పీకర్ సౌండ్ సిస్టెమ్ కూడా ఇందులో ఉండటం విశేషం.
ఇండియాలో జీప్ గ్రాండ్ చెరోకీ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.
సంబంధిత కథనం
టాపిక్