యూఏఈకి లీ ఫార్మా స్మూత్‌వాక్ ఔషధాలు-lee pharma smoothwalk medicines now available in the uae ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  యూఏఈకి లీ ఫార్మా స్మూత్‌వాక్ ఔషధాలు

యూఏఈకి లీ ఫార్మా స్మూత్‌వాక్ ఔషధాలు

HT Telugu Desk HT Telugu
Nov 03, 2023 05:33 PM IST

ఫార్మాస్యూటికల్ కంపెనీ లీ ఫార్మా.. కీళ్ల వ్యాధి చికిత్సలో వాడే బయో-కార్టిలేజ్ స్మూత్‌వాక్ టాబ్లెట్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతంలో మార్కెట్ చేయనుంది. యూఏఈకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ప్రివెన్షన్ నుంచి ఈ మేరకు అనుమతి పొందింది.

కీళ్ల వ్యాధి చికిత్సలో వినియోగించే స్మూత్ వాక్ టాబ్లెట్లు
కీళ్ల వ్యాధి చికిత్సలో వినియోగించే స్మూత్ వాక్ టాబ్లెట్లు (Pixabay)

హైదరాబాద్, నవంబర్ 3: కీళ్ల వ్యాధి చికిత్సలో వాడే బయో-కార్టిలేజ్ స్మూత్‌వాక్ టాబ్లెట్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతంలో లీఫార్మా మార్కెట్ చేయనుంది. ఈ మేరకు అనుమతులు సాధించింది. కంపెనీ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలవనుంది. భారత్ లో తయారైన ఇటువంటి ఉత్పాదనకు యూఏఈలో ఆమోదం రావడం ఇదే మొదటిసారి అని లీ ఫార్మా తెలిపింది. ఈ ఉత్పత్తిని ఆన్ని మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియా దేశాలలో విక్రయించేందుకు కంపెనీ దరఖాస్తు చేసుకుంది. అలాగే మార్కెటింగ్ ఆథరైజేషన్ కోసం యూఎస్ ప్రభుత్వానికి 2024 మూడవ త్రైమాసికంలో దరఖాస్తు చేస్తామని కంపెనీ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు.

స్మూత్ వాక్ టాబ్లెట్లు
స్మూత్ వాక్ టాబ్లెట్లు

శక్తివంతమైన ఫైటో పోషకాలతో సహజ బయోన్యూట్రాస్యూటికల్స్‌ ఆధారంగా ఈ ట్యాబ్లెట్లను తయారు చేశారు. కొలాజెన్‌ టైప్‌–2, ఎగ్‌ షెల్‌ నుంచి సేకరించిన పొర, గుగ్గిలం, పసుపు నుంచి తీసిన కుర్కుమిన్, విటమిన్‌ డి–3 మేళవింపుతో ఔషధాన్ని ఉత్పత్తి చేశారు. మృదులాస్థిని (కార్టిలేజ్‌) పెంచి కీళ్లలో కణజాల రుగ్మతలపై ఇది చక్కగా పనిచేస్తుంది. తద్వారా నొప్పులు, గట్టిదనాన్ని తగ్గిస్తుంది. ఈ మందు వాడితే సర్జరీలను నివారించవచ్చని లీలా రాణి వెల్లడించారు. స్మూత్‌వాక్ టాబ్లెట్స్ భారతదేశంలో ఇప్పటికే బాగా ఆదరణ పొందాయి. బాధాకరమైన, ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు అద్భుతమైన ఉపశమనాన్ని ఇవి ఇస్తాయని కంపెనీ డైరెక్టర్ చెప్పారు.

బయో-కార్టిలేజ్ స్మూత్‌వాక్ టాబ్లెట్స్ Amazon, leehealthdomain వంటి ఆన్‌లైన్ స్టోర్‌లలో, భారతదేశంలోని అన్ని ప్రముఖ ఫార్మసీలలో అందుబాటులో ఉన్నాయి.

సాధారణంగా బాధితుల్లో ఎక్కువ మంది మందులు, చికిత్సల కోసం వెళతారు. చివరి ప్రయత్నంగా శస్త్ర చికిత్స (సర్జరీ) చేయించుకుంటున్నారు. ఆస్టియోఆర్థరైటిస్‌ చికిత్సలో వాడే నాన్‌స్టెరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ డ్రగ్స్, అనాల్జెసిక్స్‌ నొప్పిని నివారించి తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి.

స్కూత్‌వాక్‌ ట్యాబ్లెట్లు రోజూ 2–3 వేసుకోవడం ద్వారా మూడు వారాల్లో నొప్పుల నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది. ఇది సరళత (లూబ్రికేషన్‌), కదలిక మెరుగుపరిచి కీళ్లకు అనువుగా ఉంటుంది. ట్యాబ్లెట్లను మూడు నాలుగు నెలలు వాడడం ద్వారా సర్జరీలను నివారించవచ్చు. 18 ఏళ్లుపైబడ్డ వారందరూ వాడొచ్చు.

అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో కీళ్లవాపునకు (ఆర్థరైటిస్‌) సంబంధించి ఆస్టియోఆర్థరైటిస్‌ సాధారణంగా వచ్చే రెండవ అతిపెద్ద జబ్బు. దేశంలో 18 కోట్లకు మందికిపైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్‌ రోగుల కంటే ఆర్థరైటిస్‌ బాధితులే అధికం. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఈ రుగ్మత బారిన పడుతున్నారు. 65 ఏళ్లపైబడ్డ మహిళల్లో 45 శాతం మందికి ఈ జబ్బు లక్షణాలు బయటపడుతున్నాయి. పరీక్షల్లో వీరిలో 70 శాతం మందికి రుగ్మత నిర్దారణ అవుతోంది.

WhatsApp channel

టాపిక్