iQOO Z9x launch : ఇండియాలో ఐక్యూ జెడ్9ఎక్స్ లాంచ్ డేట్ ఫిక్స్..!
iQOO Z9x : ఇండియాలో ఐక్యూ జెడ్9ఎక్స్ లాంచ్ డేట్ ఖరారైంది. అయితే.. అధికారిక లాంచ్‌కు ముందే పలు ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
iQOO Z9x price in India : ఇంటర్నెట్లో అనేక లీక్స్, పుకార్ల కారణంగా ఐక్యూ జెడ్9ఎక్స్‌పై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు.. ఎట్టకేలకు రాబోయే ఐక్యూ జెడ్ 9ఎక్స్ లాంచ్ తేదీని ప్రకటించింది సంస్థ. పవర్ఫుల్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్ అరంగేట్రం చేయనుంది. ఐక్యూ జెడ్9ఎక్స్ లాంచ్ తేదీ మే 16, 2024. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తదితరాల వివరాలను ఇక్కడ చూడండి..
ఐక్యూ జెడ్9ఎక్స్ లాంచ్ డేట్..
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ తన రాబోయే ఐక్యూ జెడ్ 9ఎక్స్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని వెల్లడిస్తూ ఎక్స్ పోస్ట్‌ను పంచుకుంది. ఐక్యూ జెడ్9ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ని మే 16, 2024న భారత్‌లో అధికారికంగా లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే చైనా, మలేషియాలో అరంగేట్రం చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు నిర్ణీత తేదీన భారత్‌లో లాంచ్ కానుంది. లాంచ్ తేదీతో పాటు, ఈ స్మార్ట్‌ఫోన్.. అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని ఐక్యూ ధృవీకరించింది.
ఐక్యూ జెడ్9ఎక్స్ స్పెసిఫికేషన్లు..
iQOO Z9x launch date India : ఐక్యూ జెడ్9ఎక్స్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్..1080×2408 పిక్సెల్ రిజల్యూషన్‌ని సపోర్ట్ చేస్తుంది. క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్తో పనిచేసే ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టెంపై ఐక్యూ జెడ్9ఎక్స్ పనిచేస్తుంది. అంతేకాకుండా, ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండొచ్చు. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఐక్యూ జెడ్9ఎక్స్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
iQOO Z9x specifications : అయితే.. ప్రస్తుతం ఇవి రూమర్స్‌గానే ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై లాంచ్ టైమ్‌కి అన్ని వివరాలు బయటకు వస్తాయి. ధరకు సంబంధించిన వివరాలుపైనా ఓ క్లారిటీ వస్తుంది.
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కొనాలా..?
Vivo Y18 launch : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వరుస లాంచ్‌లతో వివో సంస్థ మంచి జోరు మీద ఉంది! తాజాగా మరో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ని లాంచ్ చేసింది. అవి.. వివో వై18, వివో వై18ఈ. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌గా వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. డ్యూయెల్ రియర్ కెమెరాలు, విలక్షణమైన వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉన్న ఈ రెండు డివైజ్‌లు.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత యూఐతో పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండు గ్యాడ్జెట్స్‌కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం