iPhone 14 Pro Max discount: ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ పై భారీ డిస్కౌంట్..-iphone 14 pro max discount rolled out check amazon deal now ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Iphone 14 Pro Max Discount Rolled Out! Check Amazon Deal Now

iPhone 14 Pro Max discount: ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ పై భారీ డిస్కౌంట్..

HT Telugu Desk HT Telugu
Oct 03, 2023 03:18 PM IST

iPhone 14 Pro Max discount: ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో అనేక ఈ కామర్స్ సైట్స్, రిటైల్ స్టోర్స్ ఐ ఫోన్ 14 సిరీస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే, ఆమెజాన్ లో ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ పై మంచి ఆఫర్ అందుబాటులో ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP)

iPhone 14 Pro Max discount: ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఆమెజాన్ ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. 256 జీబీ స్టోరేజ్ తో ఉన్న ఐ ఫోన్ 14 ఒరిజినల్ ధర ప్రొ మాక్స్ ధర రూ. 1,49, 900 గా ఉంది. అయితే, ఈ ధరపై ఆమెజాన్ ఆకర్షణీయమైన డిస్కౌంట్ ను ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ డీల్ కూడా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఐఫోన్ 14 ప్రో మాక్స్ ధర తగ్గింపు

ఆమెజాన్ లో ప్రస్తుతం ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ 7 శాతం తగ్గింపు ధరలో లభిస్తోంది. అంటే డిస్కౌంట్ అనంతరం ఇది కేవలం రూ. 139990 లకు లభిస్తుంది. అంటే రూ. 9910 వరకు ఆదాచేయవచ్చు. అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ నైనా ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ పై మరింత డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఎక్స్చేంజ్ బోనస్ గరిష్టంగా రూ. 37,500 వరకు ఉంటుంది. అయితే, ఎక్స్చేంజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్ ల ఆధారంగా ఎక్స్చేంజ్ మొత్తం మారుతూ ఉంటుంది. అయితే, ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అన్ని చోట్ల అందుబాటులో లేదు. మీ ప్రాంతంలో ఇది అందుబాటులో ఉందో లేదో ఆమెజాన్ సైట్ లోకి వెళ్లి, మీ పిన్ కోడ్ ను ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఫీచర్లు

ఐఫోన్ 14 ప్రో మాక్స్ 2796x1290 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో అద్భుతమైన 6.70-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.ఇందులో ఏ 16 బయోనిక్ ప్రాసెసర్ ఉంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 12 ఎంపీ కెమెరా ఉంటుంది. వెనుక వైపు, 48 ఎంపీ, 12 ఎంపీ మరియు 12 ఎంపీ లెన్స్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది.

WhatsApp channel