Infosys share price : ఇన్ఫోసిస్​ షేర్లు​ 10శాతం పతనం.. ఇప్పుడు బై?-infosys share price hits lower circuit drops 10 percent in morning trade should you buy now ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infosys Share Price : ఇన్ఫోసిస్​ షేర్లు​ 10శాతం పతనం.. ఇప్పుడు బై?

Infosys share price : ఇన్ఫోసిస్​ షేర్లు​ 10శాతం పతనం.. ఇప్పుడు బై?

Sharath Chitturi HT Telugu
Apr 17, 2023 11:52 AM IST

Infosys Q4 results : ఇన్ఫోసిస్​ షేర్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో డీలా పడ్డాయి. లోయర్​ సర్క్యూట్​ను టచ్​ చేశాయి. మరి ఇప్పుడు బై చేయవచ్చా?

10శాతం పతనమైన ఇన్ఫోసిస్​ షేర్లు.. ఇప్పుడు కొనొచ్చా?
10శాతం పతనమైన ఇన్ఫోసిస్​ షేర్లు.. ఇప్పుడు కొనొచ్చా? (REUTERS)

Infosys share price : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఇన్ఫోసిస్​ స్టాక్​ కారణంగా ఐటీ సెక్టార్​లో రక్తపాతం నమోదవుతోంది. క్యూ4 ఫలితాల్లో అంచనాలు మిస్​ అవ్వడంతో ఇన్ఫోసిస్​ షేర్లు 10శాతం పతనం కాగా.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్​ దాదాపు 6శాతం నష్టాల్లో కొనసాగుతోంది. మరి ఇంత భారీగా పడిన ఇన్ఫోసిస్​ షేర్లను ఇప్పుడు కొనొచ్చా?

క్యూ4 ఫలితాలతో ఇన్ఫీ డీలా..!

స్టాక్​ మార్కెట్​లు ఓపెన్​ అయిన వెంటనే.. ఇన్ఫోసిస్​ స్టాక్​లో విపరీతమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దాదాపు 11.5శాతం మేర నష్టాలతో ఒకానొక దశలో ఈ ఐటీ స్టాక్​ రూ. 1,250కి పడిపోయింది. లోయర్​ సర్కూట్​ టచ్​ అవ్వడంతో కొంతసేపు ట్రేడింగ్​ ఆగిపోయింది. ఇన్ఫోసిస్​ షేర్లు.. ఇంత దారుణంగా పతనమవ్వడం.. రెండేళ్లలో ఇది మొదటిసారి. ఒక్క రోజుల్లో ఇంత నష్టపోవడం 2019 తర్వాత ఇదే తొలిసారి. సోమవారం ఉదయం 11:20 గంటలకు 11శాతం నష్టాలతో రూ. 1,237 వద్ద ఉంది కొనసాగుతోంది.

Infosys Q4 results 2023 : ఇంత భారీ పతనానికి కారణం ఇన్ఫీ విడుదల చేసిన క్యూ4 ఫలితాలతో పాటు ఔట్​లుక్!. గత గురువారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసిన అనంతరం 2023ఆర్థిక ఏడాది నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్​. దాదాపు అన్ని విభాగాల్లోనూ మార్కెట్​ అంచనాలను మిస్స్​ చేసింది. సంస్థ నెట్​ ప్రాఫిట్​ 8శాతం వృద్ధితో రూ. 6,128కోట్లకు పెరిగింది. సంస్థ రెవెన్యూ 16శాతం వృద్ధి చెంది రూ. 37,441కు చేరింది. ఈ రెండూ.. నిపుణుల అంచనాల కన్నా చాలా తక్కువగా నమోదయ్యాయి.

ఇన్ఫోసిస్​ క్యూ4 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Infosys share price target : ఇక 2024 ఆర్థిక ఏడాదికి సంబంధించి వీక్​ ఔట్​లుక్​ ఇచ్చింది ఇన్ఫోసిస్​. అంతర్జాతీయంగా నెలకొన్న బ్యాంకింగ్​ సంక్షోభం ప్రభావం తమపై ఉంటుందని వెల్లడించింది.

ఇన్ఫోసిస్​ స్టాక్​.. ఇప్పుడు బై?

ఇన్ఫోసిస్​ స్టాక్​పై ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థలు ఇస్తున్న టార్గెట్స్​ని ఇప్పుడు చూద్దాం..

Infosys share latest news : జెఫ్ఫరీస్​:- ఇన్ఫోసిస్​ ఫలితాలు షాకింగ్​గా ఉన్నప్పటికీ.. ఈ బ్రోకరేజ్​ సంస్థ బై కాల్​నే ఇస్తోంది. టార్గెట్​ ప్రైజ్​ రూ. 1,570 అని చెబుతోంది. ప్రస్తుతం స్టాక్​ పడటంతో అట్రాక్టివ్​ జోన్​కు వచ్చిందని స్పష్టం చేస్తోంది.

నోమురా:- మరో బ్రేకరేజ్​ సంస్థ నోమురా న్యూట్రల్​ స్టాండ్​ తీసుకుంది. ఇన్ఫోసిస్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ రూ. 1,290 అని చెబుతోంది.

హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​:- గతంలో ఇన్ఫీకి బై కాల్​ ఇచ్చింది ఈ బ్రోకరేజ్​ సంస్థ. క్యూ4 ఫలితాల అనంతరం.. దానిని 'యాడ్​'కు మార్చింది. స్టాక్​ ప్రైజ్​ టార్గెట్​ రూ. 1,470 అని పేర్కొంది. అయితే గతంలో ఈ టార్గెట్​ రూ. 1,830గా ఉండేది.

ఇన్ఫోసిస్​ స్టాక్​ ప్రైజ్​ హిస్టరీ..

Infosys latest news : గత ఐదు ట్రేడింగ్​ సెషన్స్​లో ఇన్ఫోసిస్​ స్టాక్​ 12.99శాతం మేర పడింది. నెల రోజుల వ్యవధిలో 12.3శాతం మేర పతనమైంది. 6నెలల్లో 16.7శాతం, ఏడాదిలో ఏకంగా 23శాతం పడిపోయింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు 19శాతం నష్టపోయింది ఇన్ఫోసిస్​ షేరు.

Whats_app_banner

సంబంధిత కథనం