Infinix Zero 20: 60MP ఫ్రంట్ కెమెరాతో ఇన్ఫినిక్స్ కొత్త మొబైల్ వచ్చేసింది.. బడ్జెట్ ధరలోనే..
Infinix Zero 20: ఇన్ఫినిక్స్ జీరో 20 మొబైల్ ఇండియాలో అడుగుపెట్టింది. 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 108 మెగాపిక్సెల్ వెనుక ప్రైమరీ కెమెరాతో ఈ నయా 4జీ ఫోన్ వస్తోంది. పూర్తి వివరాలు ఇవే.
Infinix Zero 20 India launch: కొంతకాలం నుంచి టీజ్ చేస్తూ వస్తోన్న ఇన్ఫినిక్స్ జీరో 20 మొబైల్‍ను ఇన్ఫినిక్స్ లాంచ్ చేసింది. జీరో సిరీస్‍లో కెమెరాలే ప్రధాన ఆకర్షణగా ఈ నయా 4జీ స్మార్ట్‌ఫోన్‍ను భారత మార్కెట్‍లో విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జీతో పాటు ఈ జీరో 20 4జీ ఫోన్‍ను కూడా ఆ సంస్థ తీసుకొచ్చింది. 60 మెగాపిక్సెల్ OIS ఫ్రంట్ కెమెరా ఇన్ఫినిక్స్ జీరో 20 ఫోన్‍కు ప్రధాన ఆకర్షణగా ఉంది. అలాగే ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేను ఈ మొబైల్ కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ జీరో 20 పూర్తి వివరాలు ఇవే..
ఇన్ఫినిక్స్ జీరో 20 ధర
Infinix Zero 20 Price in India: ఇన్ఫినిక్స్ జీరో 20 ఒకే వేరియంట్‍లో అందుబాటులోకి వస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే ఈ ఫోన్ ధర రూ.15,999గా ఉంది. ఈనెల 29వ తేదీన ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ ఫ్లిప్‍కార్ట్ లో ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. స్పేస్ గ్రే, గ్లిట్టర్ గోల్డ్, గ్రీన్ ఫ్యాంటసీ కలర్లలో ఈ ఇన్ఫినిక్స్ జీ20 మొబైల్ అందుబాటులోకి వస్తుంది.
ఇన్ఫినిక్స్ జీరో 20 స్పెసిఫికేషన్లు
Infinix Zero 20 Specifications: 6.7 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేను ఇన్ఫినిక్స్ జీరో 20 4జీ మొబైల్ కలిగి ఉంది. 90హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎక్స్ఓఎస్ 12తో వస్తోంది.
ఇన్ఫినిక్స్ జీరో 20 ఫోన్.. 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక మొబైల్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను ఇన్ఫినిక్స్ ఇచ్చింది.
ఇన్ఫినిక్స్ జీరో 20 మొబైల్‍లో 4500mAh బ్యాటరీ ఉంది. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్‍కే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్‍ఎఫ్‍సీ, బ్లూటూత్, 3.5mm హెడ్‍ఫోన్ జాక్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.