New Notes : పెళ్లికి రూ.10, 20, 50 కొత్త నోట్ల కట్టలు కావాలా? ఇలా బుక్ చేసుకోవచ్చు
New Notes Booking : నవంబర్ నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో డబ్బు చాలా అవసరం. ఖర్చుల కోసమని కాదు.. చాలా మంది వధూవరులకు కొత్త నోట్లను దండలుగా వేస్తారు. అలాంటి సమయంలో మీరు వీటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు.
వధూవరుల మెడలో నోట్లను దండలుగా వేయడం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఓ దగ్గర మాత్రమే చూస్తుంటాం. గతంలో ఈ ట్రెండ్ లేదు.. కానీ ఇటీవలి కాలంలో మెల్లగా మెుదలవుతుంది. వధూవరుల స్నేహితులు ఇలాంటివి చేయడం కనిపిస్తూ ఉంటుంది. అయితే పాత నోట్లను కొత్త జంట మెడలో వేస్తే ఏం బాగుంటుంది. కొత్త నోట్ల కట్టలను వారి మెడలో వేయవచ్చు. ఇందుకోసం మీరు కొత్త నోట్లను బుక్ చేసుకోవచ్చు.
ఇలా వేసేందుకు చిన్న నోట్లను ఉపయోగిస్తుంటారు. అంటే రూ.10, రూ.20, రూ.50. కానీ ఇవి అంత తేలిగ్గా అందుబాటులో ఉండవు. రిజర్వ్ బ్యాంక్ రూ.10 నోట్ల జారీని నిలిపివేసింది. అయితే రూ.100, రూ.500 నోట్ల కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు.
కొందరు స్వాగతం పలికేందుకు కూడా కొత్త నోట్ల దండలు వేస్తారు. పాతబడిన నోట్లు చిరిగిపోతే అవి బాగా కనిపించవు. కొన్ని ఇళ్లలో వివాహా సమయంలో ఇలా జరిగితే శకునంగా కూడా చూస్తారు. మీరు దండలుగా వేసేందుకు 10, 20, 50 రూపాయల నోట్లను పొందాలనుకుంటే ఎక్కడా ఎవరినీ సహాయం అడగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో నోట్లను కొనుగోలు చేయడానికి వెబ్‌సైట్స్ ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా రూ.200, కొత్త రూ.100 నోట్లను కూడా పొందవచ్చు. మీరు 1 రూపాయి నోటును కొనుగోలు చేయాలనుకుంటే.. 100 కొత్త నోట్ల కట్ట ఆన్‌లైన్ ధర 555 రూపాయలుగా ఉంది. వీటిని మీ ఇంటికి డెలివరీ చేయడానికి రూ. 50 నుండి రూ. 100 వరకు ప్రత్యేక షిప్పింగ్ ఛార్జీని చెల్లించాలి.
మీరు collectorbazar.comలాంటి వెబ్‌సైట్ ద్వారా కూడా కొత్త నోట్ల కట్టను పొందవచ్చు. ఇది కాకుండా మరికొన్ని వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. మీరు దానిలో నమోదు చేసుకోవాలి. దీని తరువాత రూ. 10, రూ. 20 లేదా రూ. 50 కట్టలను ఎంచుకుని, వాటిని కార్ట్‌లో చేర్చాలి. తర్వాత మీరు మీ పేరు, చిరునామాను నమోదు చేయాలి. మీరు డబ్బులు చెల్లించడంపు ద్వారా బుక్ చేసుకోవచ్చు.
బ్యాంకు ఉద్యోగుల ప్రకారం, రూ.10, 50, 200 కొత్త నోట్లు పరిమిత పరిమాణంలో బ్రాంచ్‌కు పంపిస్తారు. అందువల్ల ఈ నోట్లు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండవు. మీరు కావాలి అనుకుంటే అందులో బుక్ చేసుకోవచ్చు.
నకిలీ నోట్లను చెక్ చేయండి
నోట్లను ఆర్డర్ చేసినప్పుడు నకిలీ నోట్ల గురించి భయం ఉంటుంది. భారతీయ కరెన్సీపై గాంధీజీ ఫోటో వాటర్‌మార్క్ ఉంటుంది. నకిలీ కరెన్సీని తయారు చేసే వ్యక్తులు వాటర్‌మార్క్‌లను తయారు చేయడానికి భారీ నూనె లేదా గ్రీజును ఉపయోగిస్తారు. దీని కారణంగా వాటర్‌మార్క్ సాధారణం కంటే మందంగా కనిపిస్తుంది. ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకునేప్పుడు వాటర్‌మార్క్‌పై శ్రద్ధ వహించండి. ఈ వాటర్‌మార్క్ అసలైన వాటి నుండి నకిలీ నోట్లను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదాల టైపోగ్రఫీని తనిఖీ చేయవచ్చు. ఈ పదాలు నకిలీ నోటుపై బోల్డ్‌గా కనిపిస్తాయి. అసలు నోటులో చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
గమనిక : ఇది నోట్లను కొనుగోలు చేయమని సలహా కాదు. కేవలం మీకు సమాచారం ఇవ్వడం కోసమే కథనం ఇచ్చాం. నకిలీ నోట్ల గురించి జాగ్రత్త వహించాలి. క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.