ITR Filing : సీఏ లేకుండా ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయడం ఎలా? చివరి తేదీ పొడిగిస్తారా?-how to file itr online without chartered accountant will the itr deadline be extended ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Itr Filing : సీఏ లేకుండా ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయడం ఎలా? చివరి తేదీ పొడిగిస్తారా?

ITR Filing : సీఏ లేకుండా ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయడం ఎలా? చివరి తేదీ పొడిగిస్తారా?

Anand Sai HT Telugu
Jul 10, 2024 10:11 AM IST

ITR Filing Online : చాలా మంది సీఏతో ఐటీఆర్ ఫైల్ చేయిస్తారు. సీఏ లేకుండా మీరే ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ఆదాయపు పన్ను వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటే.. మీకోసం ఈజీ స్టెప్స్ ఉన్నాయి.

ఐటీఆర్ ఫైలింగ్ స్టెప్స్
ఐటీఆర్ ఫైలింగ్ స్టెప్స్ (Unsplash)

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు చివరి తేదీ జూలై 31గా ఉంది. నెమ్మదిగా ఈ తేదీ సమీపిస్తోంది. ఇప్పటికీ మీరు ఇంకా మీ ఐటిఆర్ దాఖలు చేయకపోతే.. తరువాత ఎటువంటి సమస్య లేకుండా త్వరపడండి. ఎంత తొందరగా ఈ పని ముగిస్తే మీకే అంత మంచిది. వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో చాలా మందికి ఫారం-16 వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పులు జరగకుండా ఉండాలంటే చివరి నిమిషంలో ఐటీఆర్ దాఖలు చేసే అలవాటును మార్చుకోవాలన్నది చాలా మంది నిపుణుల సలహా. గతసారి మాదిరిగానే ఈసారి కూడా ఐటీఆర్ దాఖలుకు గడువు పెరిగే అవకాశం లేదు. డేట్ పొడిగించే ఛాన్స్ లేదని అంటున్నారు. అందుకే ఈ పని త్వరగా కంప్లీట్ చేసుకోవాలి.

ఇందుకోసం మీరు సీఏల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీరు ఆదాయపు పన్ను వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఐటీఆర్ దాఖలు చేయాలనుకుంటే HT Telugu దశల వారీగా స్టెప్స్ చెబుతుంది.

ఐటీఆర్ దాఖలు చేయడానికి ముందు ఈ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి..

ఫారం 16 ఫారం 16ఏ ఫారం

26ఏఎస్

క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్స్

ప్రూఫ్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రూఫ్

ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

స్టెప్ 1 : ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ పోర్టల్లోకి లాగిన్ అవ్వండి.

స్టెప్ 2 : ఈ-ఫైల్ మెనూలోకి వెళ్లి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎంచుకోండి.

స్టెప్ 3 : మీ ఆదాయం ఆధారంగా ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోండి (మీకు ఫామ్ 16 ఉంటే ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2). అసెస్మెంట్ ఇయర్ (ఏవై) 2023-24 ఎంచుకోండి.

స్టెప్ 4 : ఫారంలో ఎంటర్ చేసిన డేటా మొత్తాన్ని వెరిఫై చేసి సబ్మిట్ చేయాలి.

స్టెప్ 5 : సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ లేదా అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్లను ఉపయోగించి మీ రిటర్న్‌ను ఇ-వెరిఫై చేయండి.

స్టెప్ 6 : మీ రిటర్న్‌ను అప్లోడ్ చేసి వెరిఫై చేయండి.

ఐటీఆర్ ఎవరు దాఖలు చేయాలి?

80 సి, 80 సిసిసి, 80 సిసిడి, 80 డి, 80 ఇ, 80 జి, 80 జిజిఎ, 80 టిటిఎ / 80 టిటిబి వంటి సెక్షన్ల కింద మినహాయింపునకు ముందు మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని దాటితే మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయాలి. అలాగే, భారత నివాసిగా, మీరు భారతదేశం వెలుపల ఏదైనా ఆస్తి లబ్ధిదారు అయితే, మీరు ఐటిఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

అలాగే మీరు మీ బ్యాంకు ఖాతాలలో నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ చేసినట్లయితే ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. కరెంట్ ఖాతాలకు మొత్తం రూ.కోటి, సేవింగ్స్ బ్యాంకు ఖాతాలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలకు రూ.50 లక్షలుగా ఉంది.

Whats_app_banner