IT department Survey BBC office : బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ 'సర్వే!'-bbc office in delhi being searched by income tax department says media reports ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  It Department Survey Bbc Office : బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ 'సర్వే!'

IT department Survey BBC office : బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ 'సర్వే!'

Sharath Chitturi HT Telugu
Feb 14, 2023 01:12 PM IST

Income tax department searches BBC office : ఢిల్లీతో పాటు ముంబైలో ఉన్న బీబీసీ కార్యాలయాలకు ఐటీశాఖ అధికారులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆఫీసుల్లో వారు సర్వే చేపట్టినట్టు సమాచారం.

ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు
ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు (HT_PRINT)

Income tax department raids on BBC office : ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబైలోని బీబీసీ కార్యాలయాల తలుపు తట్టారు. మంగళవారం ఉదయం పలు అంశాలపై 'సర్వే' చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైన తరుణంలో ఐటీశాఖ చర్యలు చర్చలకు దారితీశాయి.

సర్వే ఎందుకు?

ఇంటర్నేషనల్​ ట్యాక్సేషన్​, ట్రాన్స్​ఫర్​ ప్రైజింగ్​లో(ట్రేడింగ్​ లావాదేవీలు) అవకతవకలతో బ్రిటీష్​ బ్రాడ్​కాస్టింగ్​ కార్పొరేషన్​కు సంబంధం ఉందన్న వార్తలను పరిగణలోకి తీసుకుని.. ఆదాయపు పన్నుశాఖ అధికారులు వార్తాసంస్థ కార్యాలయాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే.. సోదాలు జరగలేదని, ఈ ఘటనను ఐటీశాఖ అధికారులు 'సర్వే'గా సంబోధిస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించారు.

BBC documentary on PM Modi : ఈ క్రమంలో పలువురు జర్నలిస్ట్​ల ఫోన్​లను అధికారులు తీసుకున్నట్టు సమాచారం.

"బీబీసీ అకౌంట్​ పుస్తకాలను చూసేందుకు మా బృందం వెళ్లింది. కొన్ని విషయాలపై మాకు క్లారిటీ రావాల్సి ఉంది. అంతే! ఇవి సోదాలు కావు," అని ఐటీశాఖ వర్గాలు తెలిపాయి.

ఆ డాక్యుమెంటరీ ఎఫెక్ట్​తో..!

న్యూస్​ రాసే బీబీసీ.. దేశంలో ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తోంది. 2002 గుజరాత్​ అల్లర్ల నేపథ్యంలో "ఇండియా: ది మోదీ క్వశ్చన్​" అనే పేరుతో గత నెలలో ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది ఈ ప్రముఖ వార్తాసంస్థ. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురింపించిన భారత ప్రభుత్వం.. చివరికి డాక్యుమెంటరీ నిషేధం విధించింది. ఈ పూర్తి వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.

PM Modi BBC documentary : మరోవైపు ఈ డాక్యుమెంటరీని ప్రభుత్వం నిషేధించినప్పటికీ.. పలు వర్సిటీల్లోని విద్యార్థులు వీడియోలను ప్రదర్శించారు. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్​ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

విపక్షాలు ఫైర్​..

తాజా పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం మీద విపక్షాలు విరుచుకుపడ్డాయి. బీబీసీని ప్రభుత్వం టార్గెట్​ చేస్తోందని కాంగ్రెస్​ మండిపడింది.

BBC india news : "అదానీ- హిన్​డెన్​బర్గ్​ వివాదంపై దర్యాప్తు చేపట్టాలని మేము పార్లమెంట్​లో డిమాండ్​ చేస్తున్నాము. మరోవైపు బీబీసీని మోదీ ప్రభుత్వం వెంటాడుతోంది. మునిగిపోతున్న సమయంలో చాలా మంది తప్పుడు పనులు చేస్తూ ఉంటారు," అని కాంగ్రెస్​ నేత జైరామ్​ రమేశ్​ వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్