BBC documentary on PM Modi : బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
BBC documentary on PM Modi : బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
Supreme court notice to centre on BBC documentary : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించిన కేంద్రానికి.. సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీపై నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
వివాదాస్పదంగా బీబీసీ డాక్యుమెంటరీ..
2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని మోదీపై ఇటీవలే ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దేశాభివృద్ధిని తట్టుకోలేక.. కొందరు ఇండియాపై కుట్ర పన్నుతున్నట్టు ఆరోపించింది. చివరికి.. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించింది.
BBC documentary on Modi : ఈ వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది. డాక్యుమెంటరీని నిషేధించినా.. పలు వర్సిటీల్లోని విద్యార్థులు దానిని ప్రదర్శించారు. ఈ క్రమంలో అనేక మంది అరెస్ట్ అయ్యారు.
బీబీసీ డాక్యుమెంటరీని ప్రభుత్వం నిషేధం విధించడంపై సుప్రీంకోర్టులో కొన్ని రోజుల క్రితం రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్)లు దాఖలయ్యాయి. వాటిని శుక్రవారం విచారించింది అత్యున్నత న్యాయస్థానం. సంబంధిత వ్యాజ్యాలపై స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుంద్రేష్లతో కూడిన ద్విశభ్య ధర్మాసనం. డాక్యుమెంటరీని నిషేధిస్తున్నట్టు విడుదల చేసిన నోటీసులను కూడా చూపించాలని కేంద్రానికి స్పష్టం చేసింది.
BBC documentary on Modi watch online : అధికారాన్ని ఉపయోగించుకుని.. సోషల్ మీడియాలో నుంచి డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్స్‌ని తొలగించారని న్యాయవాది ఎంఎల్ శర్మ.. తన పిటిషన్లో ఆరోపించారు. లింక్స్‌ని బ్లాక్ చేసే ఉత్తర్వులను ప్రభుత్వం ఎప్పుడూ అధికారికంగా జారీచేయలేదని వివరించారు. డాక్యుమెంటరీపై నిషేధం విధించడం.. రాజ్యాంగానికి విరుద్ధమని, దుర్మార్గమని, ఏకపక్ష నిర్ణయాలని ఆరోపించారు.
BBC documentary SC notice : డాక్యుమెంటరీ నిషేధంపై మరో పిటిషన్‌ను.. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రి, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ రామ్ దాఖలు చేశారు.