How to calculate car mileage : మీ కారు ఎంత మైలేజ్ ఇస్తోందో ఇలా తెలుసుకోండి..
Car mileage : మీ కారు ఎంత మైలేజ్ ఇస్తోందో చెక్ చేయాలని ఉందా? ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో డేటా కరెక్ట్‌గానే చెబుతోందా? అని తెలుసుకోవాలని ఉందా? అయితే.. ఇదీ మీకోసమే!
How to check car mileage in Telugu : ఈ మధ్య కాలంలో కార్లు కూడా ‘స్మార్ట్’గా తయారవుతున్నాయి. ఆ ఫీచర్ అని, ఈ ఫీచర్ అని.. చాలా హై-టెక్ ఫీచర్స్.. వెహికిల్స్‌లో వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే కస్టమర్లు కూడా అన్ని టెక్నికల్ ఫీచర్స్‌ని చూసి కారును కొనుక్కుంటున్నారు. ఏది ఏమైనా.. ఫీచర్స్ కన్నా, కారు మైలేజ్‌ని చూసే కొనేవారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఇంధన ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి.. కారు కొనే ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాల్లో ‘మైలేజ్’ కచ్చితంగా ఉండాలి. మరోవైపు చాలా మంది.. తమ కారు ఇస్తున్న అసలైన మైలేజ్‌ని తెలుసుకోవాలని భావిస్తుంటారు. వారిలో మీరూ ఒకరా? అయితే.. కారు మైలేజ్‌ని ఎలా కాల్క్యులేట్ చేయాలి? అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఇక్కడ తెలుసుకోండి…
కారు మైలేజీని ఎలా లెక్కించాలో ఇక్కడ చూడండి..
ఫ్యూయల్ ట్యాంక్ నింపండి:- నాణ్యమైన పెట్రోల్ ఉంటుందని అని భావించే పెట్రోల్ పంప్‌నకు వెళ్లి ట్యాంక్ మొత్తం ఫిల్ చేయించండి. చాలా వరకు ఫ్యూయల్ డిస్పెన్సర్.. నాజిల్స్ ఆటోమేటిక్ కటాఫ్ సిస్టమ్ తో వస్తాయి. ఇంధన స్థాయి.. ఫ్యూయల్ ట్యాంక్ ఎగువ భాగానికి చేరుకున్న తర్వాత ఇంధనం నింపే వ్యవస్థను కటాఫ్ చేయడానికి అనుమతిస్తుంది. డిస్పెన్సర్ ఇంధనాన్ని నిలిపివేసే వరకు ఫ్యూయల్ ట్యాంకును నింపడం కొనసాగించండి. ఎంత ఫ్యూయెల్ లోపలికి వెళ్లింది? అనేది నోట్ చేసుకోండి.
ట్రిప్ మీటర్ రీసెట్:- ఫ్యూయల్ ట్యాంక్ గరిష్ట లెవల్ వరకు నింపిన తరువాత ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌పై ఉండే ట్రిప్ మీటర్‌ను 'జీరో'కు రీసెట్ చేయండి.
డ్రైవ్ చేయండి:- ఫ్యూయల్ ట్యాంకును పూర్తిగా ఫిల్ చేసి, ట్రిప్ మీటర్‌ని రీసెట్ చేసిన తర్వాత.. డ్రైవింగ్ ప్రారంభించండి. ఇంధనాన్ని మళ్లీ నింపుకునే ముందు కనీసం 250-300 కిలోమీటర్లు నడపాలి. దీనికి కొన్ని రోజుల సమయం పట్టొచ్చు. అయితే, ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంటే, ఎక్కువసార్లు నింపాల్సి ఉంటుంది.
How to improve car mileage : స్పీడ్ లిమిట్ పాటించండి:- డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయండి. వేగంగా నడపడం వల్ల కారు ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఇంధనాన్ని త్వరగా అయిపోతుంది. అందువల్ల, మీ కారు నిజమైన ఫ్యూయల్ ఎకానమీ రీడింగ్ పొందడానికి.. స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ ఖాళీ అయ్యే వరకు లేదా దాదాపు ఖాళీ అయ్యే వరకు దీనిని కొనసాగించండి.
Tips to improve car mileage : మైలేజ్ లెక్కించండి:- ఫ్యూయల్ ట్యాంక్‌లో ఫ్యూయల్ దాదపు అయిపోతోందన్న సమయంలో.. మీ కారు మైలేజ్‌ని కాల్క్యులేట్ చేయండి. ఎన్ని కిలోమీటర్లు నడిపారు? అనేది ట్రిమ్ మీటర్ ద్వారా తెలుస్తుంది. ఎంత ఫ్యూయల్ ఖర్చు అయ్యిందో కూడా తెలుస్తుంది.
ఫార్ములా :- కారు మైలేజ్ = డ్రైవ్ చేసిన మొత్తం కిలోమీటర్లు/ ఖర్చు అయిన ఇంధనం
(Car mileage = Kms driven/ Fuel consumed)
ఇప్పుడంటే.. కొత్త కార్లలో చాలా ఫీచర్స్ ఉంటున్నాయి. కానీ పాత మోడల్స్‌లోని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు.. మైలేజ్‌ని చూపించవు. అలాంటి వారికి.. ఇది చాలా ఉపయోగపడుతుంది.
సంబంధిత కథనం