Honda WR-V unveiled: స్టైలిష్ లుక్, డైనమిక్ స్పెసిఫికేషన్లతో కొత్త Honda WR-V-honda wr v unveiled with revamped look check features specifications and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /   Honda Wr-v Unveiled With Revamped Look: Check Features, Specifications And More

Honda WR-V unveiled: స్టైలిష్ లుక్, డైనమిక్ స్పెసిఫికేషన్లతో కొత్త Honda WR-V

HT Telugu Desk HT Telugu
Nov 02, 2022 05:20 PM IST

Honda WR-V SUV unveiled with revamped look: సరికొత్తగా మెరుగులు దిద్దిన హోండా డబ్ల్యూఆర్-వీ(Honda WR-V) మార్కెట్లోకి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Honda WR-V కన్నా మెరుగైన స్పెసిఫికేషన్స్ తో ఈ కొత్త Honda WR-V రూపొందింది.

Honda WR-V మోడల్ SUV
Honda WR-V మోడల్ SUV (Honda Cars)

Honda WR-V unveiled with revamped look: జపాన్ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ తన ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో ఒకటైన Honda WR-V ని సరికొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెడ్తోంది. ముందు భాగంలో వెడల్పాటి గ్రిల్, స్లిమ్ హెడ్ లైట్స్ కొత్త Honda WR-V మరింత డైనమిక్ గా కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Honda WR-V unveiled with revamped look: స్టైలిష్ లుక్..

అలాగే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ తో పోలిస్తే ఈ కొత్త కొత్త Honda WR-V 4,060mm పొడవు, 1,780mm వెడల్పు, 1,608mm in ఎత్తుతో వస్తోంది. అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ తో పోలిస్తే ఇది 60mm ఎక్కువ పొడవు, 46mm ఎక్కువ వెడల్పు, 7mm ఎక్కువ ఎత్తుతో రూపొందించారు.

Honda WR-V unveiled with revamped look: పూర్తిగా మెరుగులు దిద్దిన మోడల్

new generation WR-V ఎస్ యూవీ ని నవంబర్ 2న ఆవిష్కరించారు. గత మోడల్ తో పోలిస్తే దీన్ని టెక్నాలజీ పరంగా, సేఫ్టీ పరంగా ఆధునీకరించారు. అలాగే, ఈ మోడల్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెంచారు. కొత్త మోడల్ ground clearance at 220mmగా ఉంది. అలాగే, 16 ఇంచ్, 17 ఇంచ్ లుగా రెండు అలాయ్ వీల్ సైజ్ లను ఇందులో ఆఫర్ చేస్తున్నారు.

Honda WR-V unveiled with revamped look: ఇంటీరియర్స్..

కొత్త మోడల్ లో లెదర్ సీట్లను, డ్యుయల్ టోన్ ఇంటీరియర్ కలర్ స్కీమ్స్ తో అందిస్తున్నారు. సెంటర్ కన్సోల్ లో మెరుగైన డిస్ ప్లేతో డిజిటల్ ఇన్ఫోటెయిన్ మెంట్ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. 380 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. గతంలో ఇది 367 లీటర్లు మాత్రమే ఉండేది. అలాగే, వెనుక సీట్లను 60:40 split seats గా ఉంచారు.

Honda WR-V unveiled with revamped look: పవర్..

ఈ మోడల్ లో CVT transmissionతో 1.5-litre i-VTEC petrol engine ను సమకూర్చారు. ఇది 121 PS of maximum power and 145 Nm of peak torque ను అందిస్తుంది. కీ ని ఉపయోగించకుండానే లాక్, అన్ లాక్ చేసుకునే రిమోట్ ఫంక్షనింగ్ కూడా ఇందులో ఉంది. అలాగే, రిమోట్ గా ఇంజిన్ ను ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా కూలింగ్ సిస్టమ్ కూడా ఆన్ అవుతుంది. మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్ లకు పోటీగా ఈ SUV ని మార్కెట్లోకి తీసుకువస్తున్నారు.

WhatsApp channel

టాపిక్